iDreamPost
android-app
ios-app

వీరమల్లు కోసం బాక్స్ ఆఫీస్ ఎదురుచూపులు..

  • Published Jul 18, 2025 | 11:32 AM Updated Updated Jul 18, 2025 | 11:32 AM

అదేంటో తెలీదు కానీ ఒకప్పుడు శుక్రవారం వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హడావిడి ఉండేది. నెలలో కనీసం మూడు శుక్రవారాలైన సరే బాక్స్ ఆఫీస్ కళకళలాడేది. కానీ ఈ మధ్య మాత్రం వచ్చే ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ కు పరీక్షలానే అనిపిస్తుంది. సినిమాలైతే రిలీజ్ అవుతున్నయు. కానీ థియేటర్లో జనాలు మాత్రం ఉండడం లేదు

అదేంటో తెలీదు కానీ ఒకప్పుడు శుక్రవారం వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హడావిడి ఉండేది. నెలలో కనీసం మూడు శుక్రవారాలైన సరే బాక్స్ ఆఫీస్ కళకళలాడేది. కానీ ఈ మధ్య మాత్రం వచ్చే ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ కు పరీక్షలానే అనిపిస్తుంది. సినిమాలైతే రిలీజ్ అవుతున్నయు. కానీ థియేటర్లో జనాలు మాత్రం ఉండడం లేదు

  • Published Jul 18, 2025 | 11:32 AMUpdated Jul 18, 2025 | 11:32 AM
వీరమల్లు కోసం బాక్స్ ఆఫీస్ ఎదురుచూపులు..

అదేంటో తెలీదు కానీ ఒకప్పుడు శుక్రవారం వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హడావిడి ఉండేది. నెలలో కనీసం మూడు శుక్రవారాలైన సరే బాక్స్ ఆఫీస్ కళకళలాడేది. కానీ ఈ మధ్య మాత్రం వచ్చే ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ కు పరీక్షలానే అనిపిస్తుంది. సినిమాలైతే రిలీజ్ అవుతున్నయు. కానీ థియేటర్లో జనాలు మాత్రం ఉండడం లేదు. దీనితో అటు థియేటర్ ఓనర్స్ , ఎగ్జిబిటర్లు లాభాల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో జూనియర్ మాత్రమే కాస్త సౌండ్ చేస్తుంది. కొత్త హీరో కాబట్టి ఓపెనింగ్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ప్రస్తుతానికైతే సినిమా డీసెంట్ టాక్ నే సంపాదించుకుంటుంది. మొదటి రోజు కంప్లీట్ అయితే కానీ అసలు టాక్ బయటకు రాదు.

ఇక కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకు రానా నిర్మించారు. కేర్ అఫ్ కంచెరపాలెం అనే సినిమా తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని మూవీ టీం స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. అది కాకుండా తమిళ డబ్బింగ్ సినిమా మై బేబీ సినిమా కూడా ఈరోజే రిలీజ్ కానుంది. అనూహ్యంగా అది జులై 19 నుంచి మూవీ ఓటిటి లోకి రానుంది. సో ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అలాగే స్ట్రెయిట్ రిలీజ్ లతో పాటు.. రీరిలీజ్ లు కూడా అవుతున్నాయి. ఏ మాయ చేసావే మూవీ ఈరోజే రిలీజ్ అయింది. కానీ అంతగా వర్కౌట్ అవుతున్నట్లు అనిపించడం లేదు.

ఇక అవి కాకుండా ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అంతగా సౌండ్ చేయడం లేదు. సో ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ ఎదురుచూపులన్నీ కూడా హరి హర వీరమల్లు మీదే ఉన్నాయి. ఆ సినిమా వచ్చే వరకు జూనియర్ ఏమైనా హిట్ టాక్ తెచ్చుకుంటే సరే సరి. లేదా అప్పటివరకు బాక్స్ ఆఫీస్ మౌనంగా ఉండాల్సిందే. అటు హరి హర వీరమల్లు మీద అభిమానులు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మాట వాస్తవం. ఇక హరి హరుడు ఆ అంచనాలను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.