iDreamPost
android-app
ios-app

థియేటర్ లో ఫెయిల్ కానీ OTT లో మాత్రం క్లాస్ హిట్

  • Published Jul 17, 2025 | 3:35 PM Updated Updated Jul 17, 2025 | 3:35 PM

ప్రేక్షకుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. థియేటర్ లో రిలీజ్ చేసినప్పుడు కొన్ని సినిమాలను అసలు ఎవరు పట్టించుకోరు. కానీ అదే సినిమాను రీరిలీజ్ చేస్తే థియేటర్ ముందు క్యూ కడతారు. ఇక కొన్ని సినిమాలు ఓటిటి లోకి వచ్చిన తర్వాత తెగ ట్రెండ్ అయిపోతూ ఉంటాయి.

ప్రేక్షకుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. థియేటర్ లో రిలీజ్ చేసినప్పుడు కొన్ని సినిమాలను అసలు ఎవరు పట్టించుకోరు. కానీ అదే సినిమాను రీరిలీజ్ చేస్తే థియేటర్ ముందు క్యూ కడతారు. ఇక కొన్ని సినిమాలు ఓటిటి లోకి వచ్చిన తర్వాత తెగ ట్రెండ్ అయిపోతూ ఉంటాయి.

  • Published Jul 17, 2025 | 3:35 PMUpdated Jul 17, 2025 | 3:35 PM
థియేటర్ లో ఫెయిల్ కానీ OTT లో మాత్రం క్లాస్ హిట్

ప్రేక్షకుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. థియేటర్ లో రిలీజ్ చేసినప్పుడు కొన్ని సినిమాలను అసలు ఎవరు పట్టించుకోరు. కానీ అదే సినిమాను రీరిలీజ్ చేస్తే థియేటర్ ముందు క్యూ కడతారు. ఇక కొన్ని సినిమాలు ఓటిటి లోకి వచ్చిన తర్వాత తెగ ట్రెండ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో సినిమాల విషయంలో ఇలా జరుగుతూనే ఉంది. అయితే ఇందులో ప్రేక్షకుల తప్పేమి లేదు. జెనెరేషన్ మారే కొద్దీ కథలు మారుతున్నాయి.. ప్రేక్షకులు సినిమాలను చూసే తీరు మారుతుంది. కథ నచ్చకపోతే అది స్టార్ హీరో సినిమా అయినా సరే నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తున్నారు. ఇదొక రకమైతే.. ఓటిటి వచ్చిన తర్వాత సినిమా ఇంప్రెస్స్ చేస్తే మాత్రం దానికి ఎక్కడలేని హైప్ క్రియేట్ చేస్తారు.

కథ బావుంటుంది..స్క్రీన్ ప్లే బావుంటుంది.. విజువల్స్ బావుంటాయి.. కానీ ఎందుకో ఆ సినిమా థియేటర్ వర్త్ అని మాత్రం అనిపించదు. కానీ ఓటిటి లో అదరగొడుతుంది. ఇప్పుడు 8 వసంతాలు సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు అంతెం లేదు అని తీసిపడేశారు. పైగా ఫిమేల్ సెంట్రిక్ మూవీ అవ్వడంతో పెద్దగా హైప్ రాలేదు. ఇప్పుడు అదే సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో బాగా హైలెట్ చేస్తున్నారు. సినిమా అంతా ఓ మంచి కవితలా ఉందని… డైలాగ్స్ బావున్నాయి అని ఇలా సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. థియేటర్ వర్త్ వాచింగ్ సినిమా కాకపోయినా ఓటిటి లో మాత్రం వర్త్ వాచింగ్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా చూసిన తర్వాత ఓ మంచి బుక్ చదివిన ఫీలింగ్ రావడం ఖాయం.

ఇదే సినిమాను నేరుగా ఓటిటి లో రిలీజ్ చేసి ఉంటే మాత్రం.. కచ్చితంతగా మొదటి నుంచే సినిమాకు మంచి టాక్ లబించేదేమో. అలాగే దర్శకుడు ఫణీంద్ర తానూ రాసుకున్న కథకు పూర్తిగా న్యాయం చేసాడు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కవిత్వం బాగా ఎక్కువ అవ్వడంతో కొందరికి అది నప్పలేదు. అందుకే థియేటర్ లో ఈ సినిమాను ఆస్వాదించలేకపోయారు. కానీ ఓటిటి ప్రేక్షకులు మాత్రం దీనికి పెద్ద పీట వేస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ సినిమాను చూడకపోతే ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.