Swetha
ఇప్పుడు కూలి సినిమాకు ఇంత హైప్ పెరుగుతుందంటే దానికి కారణం రజినీకాంత్ మాత్రమే కాదు. లోకేష్ కూడా ఓ కారణం. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ఇంటర్వూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో లోకేష్ కూలికి సంబందించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు లోకేష్
ఇప్పుడు కూలి సినిమాకు ఇంత హైప్ పెరుగుతుందంటే దానికి కారణం రజినీకాంత్ మాత్రమే కాదు. లోకేష్ కూడా ఓ కారణం. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ఇంటర్వూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో లోకేష్ కూలికి సంబందించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు లోకేష్
Swetha
ఇప్పుడు కూలి సినిమాకు ఇంత హైప్ పెరుగుతుందంటే దానికి కారణం రజినీకాంత్ మాత్రమే కాదు. లోకేష్ కూడా ఓ కారణం. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ఇంటర్వూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో లోకేష్ కూలికి సంబందించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు లోకేష్. దానికి సంబందించిన విషయాలపై బాగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందులో అందరిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమైనా ఉందంటే.. అది లోకేష్ కనగరాజ్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్. సాధారణంగా ఏ దర్శకుడు కూడా తన రెమ్యునరేషన్ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడడు. ఒకవేళ ఇంటర్వ్యూస్ లో ఎవరైనా అడిగిన సరే మాట దాటేస్తూ ఉంటారు.
కానీ లోకేష్ మాత్రం తన రెమ్యునరేషన్ గురించి చాలా ఓపెన్ గా చెప్పేశాడు. లోకేష్ ఈ సినిమాకు ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. గతంలో తానూ తీసిన లియో సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది కాబట్టి.. ఇప్పుడు ఈ సినిమాకు తన రెమ్యునరేషన్ ను రెట్టింపు చేయడంలో తప్పేమి లేదని.. మార్కెట్ డిమాండ్ ప్రకారమే తానూ ఆ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాని చెప్పుకొచ్చాడు. నిజంగానే అనులో ప్రశ్నించడానికి ఏమి లేదు. కూలి కి ఇంత క్రేజ్ రావడానికి రజినీకాంత్ పేరుతో పాటు.. లోకేష్ పేరును కూడా బాగానే వాడుతున్నారు. ఇదే సినిమాకు ఇంకే దర్శకుడైన తీసి ఉంటె బహుశా ఇంత క్రేజ్ ఉండకపోవచ్చు. జైలర్ కాకుండా రిమైనింగ్ రజిని సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిదని కాదు. కానీ ఇప్పుడు లోకేష్ బ్రాండ్ ఇమేజ్ రజిని కి తోడవ్వడంతో సినిమా రేంజ్ మారిపోతుంది.
సో ఒక్కసారి ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక లోకేష్ ఇమేజ్ ఇంకాస్త పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. తర్వాత అమీర్ ఖాన్ తో చేయబోయే సినిమాకు లోకేష్ ఎలాంటి రెమ్యునెరేషన్ తీసుకుంటాడా అని సందేహాలు మొదలయ్యాయి. కచ్చితంగా దీనికి డబుల్ రెమ్యునరేషన్ ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా మీడియా బజ్ ఏ రేంజ్ లో ఉందొ చూస్తేనే ఉన్నాము. ఆగస్ట్ 14 మొదటి షో పడ్డాక కానీ అసలు విషయం తెలీదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.