iDreamPost
android-app
ios-app

క్రికెట్ ఆడకపోయినా పైసా వసూల్ – ఐపీఎల్ 2022

క్రికెట్ ఆడకపోయినా పైసా వసూల్ – ఐపీఎల్ 2022

ఇండియాలో జీవితాల్ని మార్చేసే క్రీడల్లో ప్రధానమైనది క్రికెట్. ఎవరూ ఆపలేని ప్రతిభ ఉంటే చాలు, క్రికెట్ లో రాణించి కాసులు సంపాదించొచ్చు. ఇలాంటి అవకాశమే నేటి యవ ఆటగాళ్ళకు అందిస్తోంది ఐపీఎల్. మ్యాచ్ ను మలుపు తిప్పే టాలెంట్ ఉన్నవాళ్ళకు ఐపీఎల్ రెడ్ కార్పెట్ వేస్తోంది. అయితే ఈ ఏడాది ఈ ముగ్గురు ఆటగాళ్ళ వైనం మాత్రం ఒకింత భిన్నం.

వేలంలో కోట్లు పోసి కొన్నా, ఆ క్రీడాకారులు బెంచ్ కు పరిమితం అవ్వడమే ఇప్పుడు అసలు టాపిక్. మైదానంలో ఆరోజుకు సరైన కూర్పును మాత్రమే ఎంచుకుంటారు. మిగిలిన ఆటగాళ్ళను పక్కన పెట్టక తప్పదు. అలా ఈ 2022 ఐపీఎల్ సీజన్లో 3 టాప్ క్రికెటర్లు బెంచ్ కే పరిమితమైనా పారితోషకాన్ని దక్కించుకున్నారు.

 

  1. డొమినిక్‌ డ్రేక్స్‌

ఐపీఎల్ ట్రోఫిని అందుకునే జట్టులో ఉండాలని ఆటగాళ్ళందరూ కలగంటారు. ఈ ఆటగాడికి ఆ కల రెండుసార్లు నెరవేరింది. అందులో వింతేముంది అనుకోకండి. వాటిల్లో ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు డొమినిక్‌ డ్రేక్స్.

2021 సీజన్లో డొమినిక్ ను చైన్నై కొనుగోలు చేసింది. ఆ దఫా చెన్నై టైటిల్ గెలిచింది. 2022 వేలంలో గుజరాత్ టైటాన్స్ 1.1 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈసారి కూడా ఒక్క మ్యాచైనా ఆడే అవకాశం రాలేదు. రెండో సీజన్లోనూ బెంచ్ పైనే ఉన్నా రెండో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.

  1. జయంత్‌ యాదవ్‌

ఈ యువ ఆల్ రౌండర్ ను గుజరాత్ టైటాన్స్ 1.7 కోట్లకు వేలంలో కొనుక్కుంది. కానీ, 2022 సీజన్ మొత్తంలో జయంత్ కు ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. చివరకు గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంతో, ఆట ఆడకుండానే ట్రోఫీని ఖాతాలో వేసుకున్నాడు.

  1. రాజ్ వర్ధన్ హంగార్గేకర్

రాజ్ వర్ధన్ కూడా యువ ఆల్ రౌండరే. ఇతణ్ని చెన్నై ఫ్రాంచైజీ 1.5 కోట్లకు కొనుక్కుంది. అండర్ -19 వన్డే ప్రపంచ కప్ లో సత్తా చాటాడు ఈ యువ ఆటగాడు. కానీ చెన్నై ఆడిన ఏ మ్యాచ్ లోనూ రాజ్ వర్ధన్ కు చోటు దక్కలేదు.