iDreamPost
android-app
ios-app

టేబుల్ టాప్ లో గుజరాత్‌ టైటాన్స్‌.. ‘వై దిస్ కొలవరి’ అంటూ ఎంజాయ్ చేస్తున్న టీం..

  • Published May 17, 2022 | 6:18 PM Updated Updated May 17, 2022 | 6:18 PM
  • Published May 17, 2022 | 6:18 PMUpdated May 17, 2022 | 6:18 PM
టేబుల్ టాప్ లో గుజరాత్‌ టైటాన్స్‌.. ‘వై దిస్ కొలవరి’ అంటూ ఎంజాయ్ చేస్తున్న టీం..

IPL2022లో గుజరాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలో ఇది కొత్త టీం, చిన్న టీం అని అందరూ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ వరుస విజయాలతో అన్ని జట్లకు షాకిచ్చి టేబుల్ టాప్ కి వెళ్ళిపోయింది. దీంతో క్రికెట్ అభిమునులకి గుజరాత్ టైటాన్స్ పై అంచనాలు పెరిగాయి. ఈ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యాని కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడగా అందులో 10 గెలిచి 20 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి తొలిజట్టుగా ప్లే ఆఫ్స్‌ కి చేరింది.

దీంతో గుజరాత్‌ ఆటగాళ్లు ఫుల్‌ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల IPL టీమ్స్ లోని క్రికెటర్లు అంతా సరదాగా గడపడం, సినిమాలు చూడటం, ఇంటర్వ్యూలు చేయటం లాంటివి చేశారు. దీంట్లో భాగంగానే గుజరాత్ ఆటగాళ్లు ఓ ‘మ్యూజిక్‌ బ్యాండ్‌’ ఏర్పాటు చేసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోల్ని గుజరాత్‌ టైటాన్స్‌ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో ఓ స్విమ్మింగ్ ఫూల్ వద్ద గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌, సాయి సుదర్శన్‌, విజయ్‌ శంకర్‌, మరి కొంతమంది ఆటగాళ్లు ధనుష్ ఫేమస్ తమిళ్ సాంగ్ ‘‘వై దిస్‌ కొలవెరి డి’’ని మ్యూజిక్ కొడుతూ పాడారు. ఆ పాట పాడుతూ ఆటగాళ్లు సరదాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet