Swetha
కూలి వార్ 2 సినిమాలు రెండు ఒకేసారి రిలీజ్ కానుండడంతో.. ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ముందు నుంచి అనుకుంటూ ఉన్నట్లు వార్ 2 కంటే కూడా కూలి కి హైప్ ఎక్కువ కొనసాగుతుంది
కూలి వార్ 2 సినిమాలు రెండు ఒకేసారి రిలీజ్ కానుండడంతో.. ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ముందు నుంచి అనుకుంటూ ఉన్నట్లు వార్ 2 కంటే కూడా కూలి కి హైప్ ఎక్కువ కొనసాగుతుంది
Swetha
కూలి వార్ 2 సినిమాలు రెండు ఒకేసారి రిలీజ్ కానుండడంతో.. ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ముందు నుంచి అనుకుంటూ ఉన్నట్లు వార్ 2 కంటే కూడా కూలి కి హైప్ ఎక్కువ కొనసాగుతుంది. లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాము. ఇలాంటి పరిస్థితిలో వార్ 2 నుంచి అప్డేట్స్ రాకపోతే చాలా కష్టం. సినిమా మీద అభిమానులకు మేకర్స్ కు ఎంత నమ్మకం ఉన్నా సరే.. సరైన అప్డేట్స్ తో సినిమాను జనాల్లోకి తీసుకురాకపోతే మాత్రం కచ్చితంగా నష్టాలు తప్పవు. సో వార్ 2 మేకర్స్ కూడా ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేశారు.
రీసెంట్ గా సినిమా నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్స్ లో ట్రైలర్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో తెలియనిది కాదు. సినిమాకు హైప్ తీసుకునిరావాలంటే ట్రైలర్స్ చాలా కీలకం. కూలి ట్రైలర్ రిలీజ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. దీనితో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 ట్రైలర్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ట్రైలర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. వార్ 2 మూవీ ట్రైలర్ ను జూలై మూడో వారంలోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. అంటే ఇంకొక్క వారంలో మూవీ ట్రైలర్ వచ్చేస్తుంది.
అంటే కూలి కంటే ముందే వార్ 2 ట్రైలర్ ను బరిలోకి దింపుతున్నారు. టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఆల్రెడీ సినిమా మీద హైప్ అయితే ఉంది. కానీ వచ్చే అప్డేట్స్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తే తప్ప గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కవు. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో ట్రైలర్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారట వార్ 2 మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.