Swetha
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా రిలీజ్ డేట్ ల పరిస్థితి గందరగోళంగా నెలకొంది. ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కూడా చెప్పిన సమయానికి వచ్చింది లేదు. ఈ గందరగోలం అటు నిర్మాతలకు ఇటు ప్రేక్షకులకు ఇద్దరికీ ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఎప్పుడు ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా రిలీజ్ డేట్ ల పరిస్థితి గందరగోళంగా నెలకొంది. ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కూడా చెప్పిన సమయానికి వచ్చింది లేదు. ఈ గందరగోలం అటు నిర్మాతలకు ఇటు ప్రేక్షకులకు ఇద్దరికీ ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఎప్పుడు ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.
Swetha
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా రిలీజ్ డేట్ ల పరిస్థితి గందరగోళంగా నెలకొంది. ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కూడా చెప్పిన సమయానికి వచ్చింది లేదు. ఈ గందరగోలం అటు నిర్మాతలకు ఇటు ప్రేక్షకులకు ఇద్దరికీ ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఎప్పుడు ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. పైగా ఓసారి పోస్ట్ పోన్ అయినా సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలంటే అదో పెద్ద తలనొప్పి మ్యాటర్ అయిపోయింది. ఆల్రెడీ ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలతో క్లాష్ తప్పడం లేదు. అలా ఇప్పుడు టాలీవుడ్ మరో ఇంట్రెస్టింగ్ క్లాష్ కి రెడీ అయింది. అనుష్క ఘాటీ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్.
అయితే అదే రోజున రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన.. రష్మీక ది గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చేలా ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం. ప్రస్తుతం రష్మిక సక్సెస్ ట్రాక్ లో నడుస్తుంది. తనకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. సినిమా బడ్జెట్ తక్కువే అయినా మేకింగ్ లో మాత్రం కాస్త ఆలస్యమైంది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 5 రిలీజ్ పెట్టుకుంటే మంచి ఆప్షన్ అవుతుందని మూవీ టీమ్ భావిస్తోందట. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఘాటీ ఈపాటికే రావాలి కానీ.. కొన్ని కారణాల వలన రిలీజ్ కాలేదు. సో ఈసారి కూడా వెనక్కు తగ్గితే మాత్రం సినిమా మీద బజ్ తగ్గిపోవడం ఖాయం. కాబట్టి సెప్టెంబర్ 5 న రిలీజ్ ఫిక్స్ చేసుకుంటే కనుక ఎట్టి పరిస్థితిలో అప్పుడు రావాల్సిందే.
అటు ది గర్ల్ ఫ్రెండ్ కు కూడా అదే బెస్ట్ డేట్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే తేజ సజ్జా మిరాయి మూవీ సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతుందని.. ఎప్పుడో అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమి లేవు. సో ఇప్పుడు పరిస్థితిలు చూస్తుంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యేలానే కనిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే అనుష్క , రష్మిక సినిమాలు ఒకే డేట్ లో రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎలాగూ రెండు సంబంధం లేని వేరు వేరు జోనర్స్ కాబట్టి కంటెంట్ బావుంటే రెండిటికి సక్సెస్ రావడం ఖాయం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.