iDreamPost
android-app
ios-app

Ambati Rayudu  తూచ్‌… రిటైర్‌ కావట్లేదు! ట్వీట్‌ను డిలీట్‌ చేసిన అంబటి 

  • Published May 14, 2022 | 4:39 PM Updated Updated May 14, 2022 | 4:42 PM
Ambati Rayudu  తూచ్‌… రిటైర్‌ కావట్లేదు! ట్వీట్‌ను డిలీట్‌ చేసిన అంబటి 

ఐపీఎల్ కు గుడ్ బై చెబుతున్నా అంటూ ట్వీట్.. ఆ వెంటనే డిలీట్. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు.. రిటైర్మెంట్‌ విషయంలో మనసు మార్చుకున్నట్లున్నాడు. ఈ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ ట్వీట్‌ చేసిన రాయుడు, అదేంటో నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.

కొన్ని సీజ‌న్లుగా ధోనీ టీంలో కొన‌సాగుతున్న‌ తెలుగు క్రికెట‌ర్ అంబటి రాయుడు, IPLకు గుడ్ బై చెప్పాల‌నుకున్నారా? అంత అవ‌స‌రం ఏమొచ్చింది? అనే చర్చ జోరుగా జరుగుతోంది. తాను రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేసిన ఆయన కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారిపోయింది. చివరి ఐపీఎల్ అని ప్రకటించడానికి తాను సంతోష పడుతున్నట్లు, 13 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్, సీఎస్కే జట్లకు ఆడినందుకు గర్వంగా ఉందని, ఇందుకు ఆ జట్లకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ ముచ్చ‌ట కాసేపే. ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.

రాయుడు ఐపీఎల్ 2010 సీజన్ తో అడుగు పెట్టాడు. 187 మ్యాచుల్లో 4,187 పరుగులు సాధించాడు. ఈ సీజన్ లో గుజరాత్ తో మ్యాచ్ లో 46, ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 40 పరుగులు, పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 78 పరుగులు చేశాడు. 36 ఏళ్ల రాయుడు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 27.10 సగటున 271 పరుగులు చేశాడు.

రాయుడు రిటైర్మెంట్‌పై స్పందించారు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్‌. అంబ‌టి రిటైర్‌ కావట్లేదు. కొంత కాలంగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నానన్న బాధలోఉన్న‌ రాయుడు, నిరాశలోనే అతను రిటైర్మెంట్‌ ప్రకటన చేశాడని, ఈ సీజ‌నే కాదు, వచ్చే సీజన్‌ కూడా రాయుడు తమతోనే ఉంటాడని వివరణ ఇచ్చారు.

చెన్నై అంటిపెట్టుకున్న ఆట‌గాళ్లు ఎవ‌రూ స‌రిగా ఆడ‌టంలేదు. ర‌వీంద్ర జ‌డేజాకూడా కెప్టెన్ గా ప‌గ్గాలు తీసుకున్నాయి. మధ్య‌లోనే వ‌దిలేశాడు. వ‌చ్చే సీజ‌న్ కు సీఎస్కేకి ఆడ‌క‌పోవ‌చ్చున‌న్న‌ది క్రికెట్ వ‌ర్గాల గాసిప్.