iDreamPost
android-app
ios-app

విశ్వంభర కథ లీక్ చేసిన దర్శకుడు..

  • Published Jul 18, 2025 | 3:52 PM Updated Updated Jul 18, 2025 | 3:52 PM

సినిమా చిన్నదైనా పెద్దదైన సరే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే.. దానికి సంబందించిన కథను బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేసినా.. మహా అయితే మూవీ ప్లాట్ ను చెప్తారేమో కానీ కథ అయితే చెప్పరు. కానీ కొంతమంది మాత్రం సినిమా కథ ఏంటో రివీల్ చేసేస్తూ ఉంటారు.

సినిమా చిన్నదైనా పెద్దదైన సరే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే.. దానికి సంబందించిన కథను బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేసినా.. మహా అయితే మూవీ ప్లాట్ ను చెప్తారేమో కానీ కథ అయితే చెప్పరు. కానీ కొంతమంది మాత్రం సినిమా కథ ఏంటో రివీల్ చేసేస్తూ ఉంటారు.

  • Published Jul 18, 2025 | 3:52 PMUpdated Jul 18, 2025 | 3:52 PM
విశ్వంభర కథ లీక్ చేసిన దర్శకుడు..

సినిమా చిన్నదైనా పెద్దదైన సరే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే.. దానికి సంబందించిన కథను బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేసినా.. మహా అయితే మూవీ ప్లాట్ ను చెప్తారేమో కానీ కథ అయితే చెప్పరు. కానీ కొంతమంది మాత్రం సినిమా కథ ఏంటో రివీల్ చేసేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో విశ్వంభర కథ రెవీల్ అయినట్టు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా దర్శకుడు వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో విశ్వంభర బేసిక్ కథ ఏంటి అనేది రివీల్ చేసేశాడు.

వసిష్ఠ చెప్పిన కథ ఏంటంటే.. ఇప్పటివరకు సినిమాలలో భూలోకం , స్వర్గలోకం , యమలోకం అంటూ అలా ఏడు లోకాలను చూపించారని.. కానీ మిగిలిన ఏడు లోకాలను కలిపి.. మొత్తం 14 లోకాలను విశ్వంభరలో చూపించబోతున్నామని చెప్పుకొచ్చారు. ఈ 14 లోకాల్లో 7 లోకాలు కింద ఉంటె.. మరో 7 లోకాలు పైన ఉంటాయట. వీటి అన్నిటి గురించి సినిమాలో క్లియర్ గా చూపించబోతున్నారట.అలాగే ఈ 14 లోకాలకు మూలమైన సత్య లోకాన్ని కూడా చూపించబోతునట్లు చెప్పుకొచ్చారు. సో వసిష్ఠ కూడా మొత్తం కథను చెప్పకపోయినా ఆల్మోస్ట్ ఇది సినిమా స్టోరీ లైన్ అని చెప్పకనే చెప్పేశాడు.

అలాగే చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరికి , భైరవ ద్వీపం కు .. విశ్వంభర కు ఎలాంటి పోలిక లేదని కూడా వసిష్ఠ తేల్చి చెప్పేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని.. సెట్స్ అనే ఫీలింగ్ కలగకుండా చాలా న్యాచురల్ గా అన్ని లోకాలను చూపిస్తామని చెప్పారు. అయితే సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ముందు సెప్టెంబర్ అనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అక్టోబర్ అని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ ఎదో ఒక అప్డేట్ ఇస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.