iDreamPost
android-app
ios-app

జూనియర్ కి హిట్ దక్కుతుందా !

  • Published Jul 17, 2025 | 4:56 PM Updated Updated Jul 17, 2025 | 4:56 PM

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్డ్రాప్ లేకుండా వచ్చి హీరోలు అయినవారు ఉన్నారు. అలాగే మంచి పలుబడితో.. ప్రముఖుల వారసులుగా వచ్చి తమ కష్టంతో ఇండస్ట్రీ జర్నీ కొనసాగించేవారు ఉన్నారు . ఇక కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని వచ్చి ఫెయిల్ అయినా వాళ్ళు ఉన్నారు.

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్డ్రాప్ లేకుండా వచ్చి హీరోలు అయినవారు ఉన్నారు. అలాగే మంచి పలుబడితో.. ప్రముఖుల వారసులుగా వచ్చి తమ కష్టంతో ఇండస్ట్రీ జర్నీ కొనసాగించేవారు ఉన్నారు . ఇక కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని వచ్చి ఫెయిల్ అయినా వాళ్ళు ఉన్నారు.

  • Published Jul 17, 2025 | 4:56 PMUpdated Jul 17, 2025 | 4:56 PM
జూనియర్  కి హిట్ దక్కుతుందా !

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్డ్రాప్ లేకుండా వచ్చి హీరోలు అయినవారు ఉన్నారు. అలాగే మంచి పలుబడితో.. ప్రముఖుల వారసులుగా వచ్చి తమ కష్టంతో ఇండస్ట్రీ జర్నీ కొనసాగించేవారు ఉన్నారు . ఇక కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని వచ్చి ఫెయిల్ అయినా వాళ్ళు ఉన్నారు. అంతా సినిమా కథ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా , జెనీలియా కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వైరల్ వయ్యారి సాంగ్ తెగ వైరల్ అయిపోతుంది.

తాజాగా మూవీ ప్రీరిలేజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు రాజమౌళిని చీఫ్ గెస్ట్ గా తీసుకుని వచ్చారు. అలాగే ఈ సినిమాను వెయ్యికి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఓ కొత్త హీరో సినిమా వెయ్యికి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. తన వారసుడి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో గాలి జనార్దన్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు అంతా ప్రేక్షకుల వంతు. సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యన ప్రేక్షకులకు ఏవి ఓ పట్టాన నచ్చడం లేదు. సో ఈ యంగ్ హీరో కు హిట్ దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

ప్రమోషన్స్ మాత్రం ఏ లోటు లేకుండా గట్టిగానే చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రమోషన్స్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. ప్రస్తుతానికైతే సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ ఏ ఉంది. ఆల్రెడీ సినిమాలో ఓ సాంగ్ కూడా వైరల్ అవుతుంది కాబట్టి ఆటోమాటిక్ గా దేవి మ్యూజిక్ క్లిక్ అయినట్టే. అలాగే సినిమాకు సంబందించిన ఇతరేత్ర వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. సో మూవీ మొదటి షో కి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ వీకెండ్ నిలదొక్కుకున్నట్లే. ఇక రిజల్ట్ ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.