iDreamPost
android-app
ios-app

రాజా సాబ్ వెనక్కు తగ్గేదే లేదట..

  • Published Jul 16, 2025 | 12:21 PM Updated Updated Jul 16, 2025 | 12:21 PM

లెక్క ప్రకారం ఇప్పటికి రాజా సాబ్ రిలీజ్ అవ్వడం.. అది క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం అన్ని జరిగిపోతూ ఉండాలి. కానీ అనుకోని విధంగా మూవీ పోస్ట్ పోన్ అయింది. అది కాస్త డిసెంబర్ 5 న గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంది. దీనితో ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా ఈ సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

లెక్క ప్రకారం ఇప్పటికి రాజా సాబ్ రిలీజ్ అవ్వడం.. అది క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం అన్ని జరిగిపోతూ ఉండాలి. కానీ అనుకోని విధంగా మూవీ పోస్ట్ పోన్ అయింది. అది కాస్త డిసెంబర్ 5 న గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంది. దీనితో ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా ఈ సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

  • Published Jul 16, 2025 | 12:21 PMUpdated Jul 16, 2025 | 12:21 PM
రాజా సాబ్ వెనక్కు తగ్గేదే లేదట..

లెక్క ప్రకారం ఇప్పటికి రాజా సాబ్ రిలీజ్ అవ్వడం.. అది క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం అన్ని జరిగిపోతూ ఉండాలి. కానీ అనుకోని విధంగా మూవీ పోస్ట్ పోన్ అయింది. అది కాస్త డిసెంబర్ 5 న గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంది. దీనితో ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా ఈ సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా రాజాసాబ్ సంక్రాంతికి ఏమైనా రానుందా అనే పుకార్లు మొదలయ్యాయి. దీనితో ప్రభాస్ అభిమానులలో కూడా సందేహాలు తలెత్తాయి. కానీ ఇప్పుడు ఎలాంటి వార్తలు వినిపిస్తున్నా కానీ రాజాసాబ్ ఎంట్రీలో మాత్రం ఎలాంటి డౌట్ లేదని ఇన్సైడ్ టాక్.

ఎందుకంటే డిసెంబర్5 సోలో ఎంట్రీ వదిలేసి.. టఫ్ కాంపిటీషన్ అయిన సంక్రాంతికి ఎందుకు వస్తుంది. పైగా అక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న సినిమాల డేట్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో డిసెంబర్ 5 రాజాసాబ్ రావడమే బెస్ట్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రాక్టీకల్ గా చూస్తే అదే డేట్ లో గతంలో వచ్చిన పుష్ప , యానిమల్ సినిమాలు బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హిట్స్ అయ్యాయి. సో పక్కాగా రాజాసాబ్ కు కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనే అనుకుంటున్నారు. సోలోగా రావడం వలన ఇలా చాలానే ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పొచ్చు.

పైగా సంక్రాంతికి చిరు , అనిల్ రావిపూడి మెగా 157 , రవితేజ తిరుమల , నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు సినిమా లైన్ బరిలో ఉన్నాయి. అలాగే అసలైనది విజయ్ జన నాయగన్ కూడా పొంగల్ కే రానుంది. సో ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా రాజాసాబ్ రిలీజ్ కు బెస్ట్ అండ్ సేఫ్ డేట్ డిసెంబర్ 5 మాత్రమే. త్వరలో మేకర్స్ కూడా ఈ పుకార్లకు చెక్ పెట్టెలా అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.