Swetha
థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఓటిటి లోకి రావాలంటే ఎంత లేదన్న కనీసం ఓ నెల రోజులు పడుతుంది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అయితే ఓటిటి ఎంట్రీకి కనీసం రెండు నెలలు పడుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తుంది.
థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఓటిటి లోకి రావాలంటే ఎంత లేదన్న కనీసం ఓ నెల రోజులు పడుతుంది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అయితే ఓటిటి ఎంట్రీకి కనీసం రెండు నెలలు పడుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తుంది.
Swetha
థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఓటిటి లోకి రావాలంటే ఎంత లేదన్న కనీసం ఓ నెల రోజులు పడుతుంది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అయితే ఓటిటి ఎంట్రీకి కనీసం రెండు నెలలు పడుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తుంది. అసలు ఏంటి ఈ సినిమా ఒక్క రోజులోనే ఓటిటి లోకి రావడం ఏంటి అనే విషయానికొస్తే..
ఈ సినిమా పేరు ‘DNA’. ఈ సినిమాకు నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించారు. ఒరిజినల్ గా తమిళనాట రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. దీనితో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. తెలుగులో ఈ సినిమాను ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్స్ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. తమిళలో DNA అనే సినిమాను తెలుగులో ‘మై బేబీ’ అనే పేరుతో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ముందుగా జూలై 11న సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఆ తర్వాత ఫైనల్ రిలీజ్ డేట్ ను జూలై 18కి ఫిక్స్ చేశారు.
అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జియో స్టార్ కొనుగోలు చేసుకుంది. ఆల్రెడీ జియో హాట్ స్టార్ జులై 25 నుంచి అన్ని భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. సో తెలుగు థియేట్రికల్ రిలీజ్ కు డిజిటల్ స్ట్రీమింగ్ కు కేవలం వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఒక్క రోజులో ఓటిటి స్ట్రీమింగ్ ఏంటి అనే విషయానికొస్తే.. జూలై 18న ఎలాంటి డౌట్ లేకుండా తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ జియో హాట్స్టార్ ఊహించని విధంగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను జూలై 25 నుంచి జూలై 19 కి ప్రీపోన్ చేసింది. అంటే జూలై 18 న తెలుగు వెర్షన్ థియేటర్ లో రిలీజ్ అయితే.. జూలై 19 నుంచి హాట్ స్టార్ లోకి వచ్చేస్తుందన్నమాట. ఇలా ఒకే రోజు గ్యాప్ తో తెలుగు రిలీజ్ అండ్ ఓటిటి రిలీజ్ ఎలా రానుందో నిర్మాతలకే తెలియాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.