iDreamPost
android-app
ios-app

ఏకంగా 4000వేల కోట్లు! నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బడ్జెట్

  • Published Jul 15, 2025 | 12:04 PM Updated Updated Jul 15, 2025 | 12:04 PM

ఇండియన్ మూవీ వైపు ప్రపంచమంతా తిరిగి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ రేంజ్ హై బడ్జెట్ తో.. ప్రామిసింగ్ కంటెంట్ తో సినిమాలను రూపొందిస్తున్నారు. కొంతకాలం కిందట 100 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కుతుందంటే... అంతా ఆశ్చర్యపోయేవారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆ వంద కాస్త వెయ్యి అయింది. ఆ తర్వాత ఆ వెయ్యికి మరో వెయ్యి యాడ్ అవుతూ పోతుంది.

ఇండియన్ మూవీ వైపు ప్రపంచమంతా తిరిగి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ రేంజ్ హై బడ్జెట్ తో.. ప్రామిసింగ్ కంటెంట్ తో సినిమాలను రూపొందిస్తున్నారు. కొంతకాలం కిందట 100 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కుతుందంటే... అంతా ఆశ్చర్యపోయేవారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆ వంద కాస్త వెయ్యి అయింది. ఆ తర్వాత ఆ వెయ్యికి మరో వెయ్యి యాడ్ అవుతూ పోతుంది.

  • Published Jul 15, 2025 | 12:04 PMUpdated Jul 15, 2025 | 12:04 PM
ఏకంగా 4000వేల కోట్లు!  నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బడ్జెట్

ఇండియన్ మూవీ వైపు ప్రపంచమంతా తిరిగి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ రేంజ్ హై బడ్జెట్ తో.. ప్రామిసింగ్ కంటెంట్ తో సినిమాలను రూపొందిస్తున్నారు. కొంతకాలం కిందట 100 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కుతుందంటే… అంతా ఆశ్చర్యపోయేవారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆ వంద కాస్త వెయ్యి అయింది. ఆ తర్వాత ఆ వెయ్యికి మరో వెయ్యి యాడ్ అవుతూ పోతుంది. ఇక ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు వేల కోట్లతో మూవీ తెరకెక్కబోతుంది. ఇది ఇండియన్ మూవీ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ లో రూపొందుతున్న రామాయణం మూవీ.

తాజాగా ఈ సినిమా నిర్మాత నమిత మల్హోత్రా ఓ పోడ్ క్యాస్ట్ లో మూవీ బడ్జెట్ ను అనౌన్స్ చేశారు. దీనితో ఒక్కసారిగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఉలిక్కిపడినంత పనైంది. ఇది ఇప్పటివరకు ఎవరు కనీ విని ఎరుగని అంకెలు. ఈ రేంజ్ బడ్జెట్ తో ఓ సినిమాను రూపొందించడం ఇదే మొదటి సారి. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా తీస్తారా అనేది సందేహమే. ప్రస్తుత్తం ఈ వార్తా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. నాలుగు వేల కోట్లు అంటే మాటలా అని అంతా అవాక్కవుతున్నారు. మొదటి నుంచి రామాయణం సినిమా హాట్ టాపిక్ గానే ఉంది. అప్పట్లో సినిమా బడ్జెట్ 2 వేల 500కోట్లని అన్నారు. కానీ ఇప్పుడు దానికి డబుల్ పెట్టుబడి పెడుతున్నారు.

రామాయణం అందరికి తెలిసిన కథే కాబట్టి.. ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించాలంటే కచ్చితంగా మ్యాజిక్ చేయాల్సిందే. అంతే కాకుండా ఇప్పటి జెనెరేషన్ వారికి మన పురాణ ఇతిహాసాల మీద నాలెడ్జ్ సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో పెద్దలే పిల్లలను తీసుకుని వస్తారు. ఇలా అన్ని కోణాలలో ఆలోచించి సినిమాను 3డి వెర్షన్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన మొదటి గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భాషలకు అతీతంగా సినిమా వరల్డ్ వైస్ రిలీజ్ అవుతుంది. సో పెట్టిన బడ్జెట్ ఈజీగా రికవర్ అవుతుందని దర్శక నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.