Junior Movie Review In Telugu: ఒక డెబ్యూ ఫిలిం కోసం ఎలాంటి పబ్లిసిటీ చేయాలో అలాంటి పబ్లిసిటీని చేశారు మూవీ టీం. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా , జెనీలియా ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ మధ్య కాలంలో మూవీ మీద బాగానే బజ్ క్రియేట్ అయింది. సో తన సైడ్ నుంచి కిరీటి తన ఎఫర్ట్స్ ను పెట్టాడు. ఇక ఇప్పుడు మూవీని ఎలా రీసివ్ చేసుకుంటారు అనేది ప్రేక్షకుల వంతు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
Junior Movie Review In Telugu: ఒక డెబ్యూ ఫిలిం కోసం ఎలాంటి పబ్లిసిటీ చేయాలో అలాంటి పబ్లిసిటీని చేశారు మూవీ టీం. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా , జెనీలియా ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ మధ్య కాలంలో మూవీ మీద బాగానే బజ్ క్రియేట్ అయింది. సో తన సైడ్ నుంచి కిరీటి తన ఎఫర్ట్స్ ను పెట్టాడు. ఇక ఇప్పుడు మూవీని ఎలా రీసివ్ చేసుకుంటారు అనేది ప్రేక్షకుల వంతు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
Swetha
గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి జూనియర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక డెబ్యూ ఫిలిం కోసం ఎలాంటి పబ్లిసిటీ చేయాలో అలాంటి పబ్లిసిటీని చేశారు మూవీ టీం. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా , జెనీలియా ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ మధ్య కాలంలో మూవీ మీద బాగానే బజ్ క్రియేట్ అయింది. వైరల్ వయ్యారి సాంగ్ బాగా వైరల్ అయింది. జూలై 18న మూవీ థియేటర్ లో ఎంట్రీ ఇచ్చింది. సో తన సైడ్ నుంచి కిరీటి తన ఎఫర్ట్స్ ను పెట్టాడు. ఇక ఇప్పుడు మూవీని ఎలా రీసివ్ చేసుకుంటారు అనేది ప్రేక్షకుల వంతు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
జూనియర్ కథ :
కోదండపాణి (రవి చంద్రన్) దంపతులకు 45 ఏళ్ళ వయస్సులో అభి (కిరీటి) జన్మిస్తాడు. లేటు వయసులో సంతానం కలగడంతో అంతా తలో మాట అంటూ ఉంటారు. దీనితో కోదండపాణి కుటుంబంతో సహా వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అభి పుట్టినప్పుడే అతని తల్లి మరణింస్తుంది. దీనితో అతని తండ్రి అభిని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తాడు. కానీ అభికి తన తండ్రి చూపించే ప్రేమగా అతిగా అనిపించడంతో.. అతనికి దూరంగా హైదరాబాద్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత అతని తండ్రి తన కోసం సిటీకి షిఫ్ట్ అవుతాడు. దీనితో అభి ఎలా అయినా అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలని.. ఉద్యోగం పేరుతో విజయ సౌజన్య(జెనీలియా) కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ వారిద్దరికీ అసలు పడదు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి అభికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి ? ఇందులో శ్రీలీల పాత్ర ఏంటి ? రావు రమేష్ క్యరెక్టర్ ఏంటి ? కోదండ పాణికి రావు రమేష్ కు ఉన్న సంబంధం ఏంటి ? చివరికి కథ ఎలా ముగుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటి నటుల పని తీరు :
సినిమాలో మెయిన్ గా హైలెట్ అయింది హీరో కిరీటినే. ఓ డెబ్యూ సినిమాకు ఎలాంటి ఎఫోర్ట్స్ పెట్టాలో దానికి పదింతలు ఎక్కువే పెట్టాడు. మెయిన్ గా డ్యాన్స్ లో ఈ జూనియర్.. జూనియర్ ఎన్టీఆర్ ను తలపిస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది అతని మొదటి సినిమా అనే ఫీలింగ్ ఎక్కడ రాదు. ఇక రవి చంద్రన్ కు చాలా కాలం తర్వాత ఓ మంచి క్యారెక్టర్ పడింది. అలాగే జెనీలియా కు మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ గా మూవీ ఉంటుందని చెప్పొచ్చు. ఇక మూవీకి కాస్త గ్లామర్ డోస్ పెంచింది శ్రీలీల. ఎప్పటిలానే తన క్యారెక్టర్ కు జస్టిఫికేషన్ చేసింది. రావు రమేష్ కూడా ఆ క్యారెక్టర్ కోసం ఎంత చేయాలో అంత చేసాడు. డెబ్యూ సినిమా అయినా సరే ఎక్కడ ఎలాంటి నేర్వస్నెస్ కనిపించలేదు హీరోలో. ఇక మిగిలిన వారంతా తమ పరిధి మేర తెరపై అలరించి.. అందరిని మెప్పించారు.
టెక్నీకల్ విభాగం పని తీరు:
సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. సినిమాను చాలా రిచ్ గా ప్రెసెంట్ చేసారు. అలాగే బ్యాక్గ్రౌండ్ విజువల్స్ అన్ని కూడా సింక్ లో ఉన్నాయి. ఇక సినిమా రన్ టైం ను ఎక్కువగా ల్యాగ్ చేయకుండా.. ఎక్కడ ఏది ఉండాలో దానిని చూపించి ఎడిటర్ తన పని తనాన్ని చూపించాడని అనిపిస్తుంటుంది. మూవీ అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా క్రిస్ప్ గా సాగిపోతూ ఉంటుంది. నిర్మాణ విలువలు అన్ని బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల స్టోరీ ఊహకు అందేలా అనిపిస్తుంది. రచనలో కొత్తదనం లేదు. కానీ రాధాకృష్ణ రెడ్డి దర్శకుడిగా సినిమాకు న్యాయం చేశారు.
విశ్లేషణ :
జూనియర్ లాంటి కథలో ఎప్పుడో అందరు చూసేసి ఉంటారు. అయినా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలంటే మాత్రం కథలో ఇంకేదో కొత్తదనం కావాల్సిందే. అలా దర్శకుడు ఓ పక్క కామిడి మరో పక్క ఎమోషనల్ సీన్స్ ను బ్యాలన్స్ చేస్తూ.. ఉన్నంతలో ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. అభి పుట్టినప్పటినుంచి అతను తన తండ్రి ప్రేమను ఎంత కష్టంగా భావించాడు.. ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇలాంటి సీన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు. అలాగే తండ్రికి కొడుకు మీద ఉండే ప్రేమ , ఆ ఎమోషన్స్ ను కూడా బాగానే చూపించారు. అలా సాగిపోతూ ఉండగా.. అతను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు జెనీలియా ఎంట్రీ ఉంటుంది. ఇక అక్కడినుంచి కథ స్పీడ్ గా నడుస్తుంది. ఆ తర్వాత అతనికి జెనీలియాకు మధ్య వచ్చే గొడవలు.. చిన్న చిన్నవి కాస్త పెద్దగా మారడం.. వారి మధ్య దూరం పెరగడం.. ఓ చిన్న ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
ఆ తర్వాత సెకండ్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగిపోతూ ఉంటుంది. కానీ దాదాపు కొన్ని సీన్స్ ఊహకు తగ్గట్టే ఉండడం మైనస్. ఇక శ్రీలీల కిరీటి మధ్యలో కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండ్ ఆఫ్ లో అనవసరమైన డీవియేషన్స్ తీసుకోకుండా దర్శకుడు చాలా క్రిస్ప్ గా కథను లాగించేసాడు. ఇది కాస్త ప్లస్ పాయింట్. హీరో హీరోయిన్ ఇద్దరు తమ పాత్రకు తగిన న్యాయం చేశారు. కానీ శ్రీలీల పాత్రకు మాత్రం సరైన క్లోజర్ లేదనే ఫీలింగ్ వస్తుంది. ఇక ఫాథర్ అండ్ సన్ ఎమోషన్స్ , సిస్టర్ సెంటిమెంట్ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తానికి కిరీటి వన్ మ్యాన్ షో అనేలా సినిమాను ముందుకు నడిపించాడు. డెబ్యూ సినిమా అయినా కానీ కొన్ని సీన్స్ లో మాత్రం అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడు.
ప్లస్ లు :
హీరో
సినిమాటోగ్రపీ
మ్యూజిక్
మైనస్ లు :
ఊహకు అందే సీన్స్(కొన్ని)
ఫ్లో మిస్ అవ్వడం
రేటింగ్ : 2.5/5
చివరిగా : జూనియర్ కిరీటి కి గ్రాండ్ ఎంట్రీ , పర్ఫెక్ట్ డెబ్యూ ఫిల్మ్