iDreamPost
android-app
ios-app

IPL 2022 : చెన్నై చేసిన తప్పు అదే.. ధోనీపై సెహ్వాగ్ వ్యాఖ్యలు..

  • Published May 06, 2022 | 3:19 PM Updated Updated May 06, 2022 | 3:20 PM
IPL 2022 : చెన్నై చేసిన తప్పు అదే.. ధోనీపై సెహ్వాగ్ వ్యాఖ్యలు..

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో తడబడుతుంది. ఈ సీజన్ కి మొదలయ్యే ముందు ధోని కెప్టెన్సీ నుండి తప్పుకున్నట్టు, జడేజాని కెప్టెన్ చేసినట్టు చెన్నై టీం తెలిపింది. ఆ నిర్ణయంతోనే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన చెన్నై కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఉన్న అన్ని మ్యాచ్ లు గెలిచినా చెన్నైకి ప్లేఆఫ్‌కి వెళ్లే అవకాశాలు లేవు.

ఇటీవలే జడేజా తన ఆట మీద మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను అని కెప్టెన్సీని మళ్ళీ తిరిగి ధోనికి అప్పగించాడు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రస్తుత IPL సీజన్ గురించి మాట్లాడుతూ చెన్నై టీం గురించి కూడా మాట్లాడాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. సీజన్‌కు ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం చెన్నై టీం చేసిన మొదటి పొరపాటు. ధోని ఆరంభ మ్యాచ్ లలో హాఫ్ సెంచరీ చేశాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ధోనీ హిట్టింగ్‌ తో అద్భుతమైన ఫినిషర్ గా మరోసారి చెన్నైని గెలిపించాడు. ఒకవేళ ధోని సీజన్ మొదటి నుంచే చెన్నైకి కెప్టెన్ గా ఉంటె మరోలా ఉండేదని ఆయన అన్నారు. అభిమానులు కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నారు.