iDreamPost
android-app
ios-app

ప్లేఆఫ్స్‌కు వెళ్లలేదని పంజాబ్ బ్యాటర్ శిఖర్ ధావన్ ని.. కొట్టి, కాలితో తన్నిన తండ్రి..

  • Published May 26, 2022 | 7:32 PM Updated Updated May 26, 2022 | 8:09 PM
  • Published May 26, 2022 | 7:32 PMUpdated May 26, 2022 | 8:09 PM
ప్లేఆఫ్స్‌కు వెళ్లలేదని పంజాబ్ బ్యాటర్ శిఖర్ ధావన్ ని.. కొట్టి, కాలితో తన్నిన తండ్రి..

పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ తన తండ్రి చేతిలో దెబ్బలు తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. IPL2022లో పంజాబ్‌ టీమ్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో తన తండ్రి తనని కొట్టారని ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు ధావన్. ఆ వీడియోలో శిఖర్ తండ్రి శిఖర్ ధావన్ ని చెంప మీద కొట్టి, కింద పడేసి కాలితో తంతున్నారు. ఆయనని ఆపడానికి కొంతమంది ప్రయత్నించినా అతను కొడుతూనే ఉన్నాడు.

ఈ సీజన్‌లో పంజాబ్‌ చివరిక్షణాల్లో ప్లేఫ్స్‌లో చోటు మిస్ చేసుకొని ఆరోస్థానంలో ఉండిపోయింది. 14 మ్యాచ్‌లు ఆడగా 7 విజయాలు, 7 ఓటములు చూసి ఢిల్లీతో సమానంగా 14 పాయింట్లు సాధించినా రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతయ్యాయి.

దీంతో ఇటీవలే ఇంటికి చేరిన పంజాబ్ బ్యాటర్ శిఖర్ ధావన్ తన తండ్రి కొట్టాడంటూ ఓ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియో చూడటానికి సీరియస్ గా ఉన్నా సరదాగానే కొట్టి ఉంటారు, అందుకే ఇలా వీడియో తీసి పోస్ట్ చేసాడు ధావన్ అని అంటున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş