iDreamPost
android-app
ios-app

ఉమ్రాన్ మాలిక్ తన ఫాస్ట్ బౌలింగ్ తో IPL2022లో ఎంత సంపాదించాడో తెలుసా??

  • Published May 30, 2022 | 6:43 PM Updated Updated May 30, 2022 | 6:43 PM
  • Published May 30, 2022 | 6:43 PMUpdated May 30, 2022 | 6:43 PM
ఉమ్రాన్ మాలిక్ తన ఫాస్ట్ బౌలింగ్ తో IPL2022లో ఎంత సంపాదించాడో తెలుసా??

IPL లో ఆక్షన్ ద్వారా కాకుండా మ్యాచ్ లలో తమ ఆటతో కూడా సంపాదించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్, ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ IPL-2022లో ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా ఆడి ఇంకా ఎక్కువే సంపాదించాడు. ఉమ్రాన్ మాలిక్ ని యాక్షన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 కోట్లకు దక్కించుకుంది.

#ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు మాలిక్ దే. దీంతో 14 మ్యాచ్ లకు గాను ఈ అవార్డుల ద్వారా 14 లక్షలు సంపాదించాడు ఉమ్రాన్ మాలిక్.

#అలాగే పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌పై బెస్ట్ ప్రదర్శన చేసినందుకు రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు సాధించాడు ఉమ్రాన్. ఈ రెండు అవార్డుల ద్వారా మరో 2లక్షలు సంపాదించాడు.

#గుజరాత్, పంజాబ్ తో మ్యాచ్ లలో తన అద్భుతమైన ఆటకు గాను గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించాడు. వీటివల్ల మరో రెండు లక్షలు సంపాదించాడు.

#పంజాబ్ తో మ్యాచ్ లో మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఉమ్రాన్‌కే దక్కడంతో దీని ద్వారా ఇంకో లక్ష రూపాయలు వచ్చాయి.

#ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా ఉమ్రాన్ మాలిక్ దక్కించుకున్నాడు. ఈ అవార్డు ద్వారా మరో 10 లక్షలు ఉమ్రాన్ చేతికి వచ్చాయి.

#దీంతో మొత్తంగా ఈ సీజన్ లో ఆక్షన్ ద్వారా వచ్చేవి కాకుండా అవార్డుల రూపంలో ఉమ్రాన్‌ మాలిక్‌ 29 లక్షలు సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇలా తన ఆటతో, తన బౌలింగ్ తో డబ్బులు సంపాదించడమే కాక BCCI సెలక్టర్లను ఆకర్షించి ఏకంగా భారత జట్టలో స్థానం సంపాదించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న T20 సిరీస్‌కు ఉమ్రాన్‌ను BCCI ఎంపిక చేసింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet