ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలలలో జరగాల్సిన టీ-20 వరల్డ్‌కప్‌ని 2022కి వాయిదా వేయబోతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్గాల నుంచి వార్తలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా సెప్టెంబరు 30 వరకు పర్యాటక వీసాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది.అలాగే ఐసీసీ టోర్నీలో పాల్గొనే 16 జట్లు అక్టోబరులో కంగారుల గడ్డపై కాలు పెట్టిన తర్వాత రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంచాల్సి ఉంది. పైగా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాలలో […]
1999 మే 19 వ తేదీని తమకు అవకాశం వస్తే చరిత్ర పుటలోంచి తొలగించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఐసీసీ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే చేతిలో భారత్ భంగపాటుకు గురైనది. పైగా వన్డేలలో ఎక్స్‌ట్రాల రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండవ జట్టుగా భారత్ నిలిచి ఒక అవాంఛనీయ రికార్డును తన పేరిట నెలకొల్పింది. లీసెస్టర్‌లో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ 8వ లీగ్ […]
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ను ప్రేమించే అభిమానుల్లో ‘డక్ వర్త్ లూయిస్’ సిస్టం గురించి తెలియని వారు ఉండరేమో.. ఆధునిక క్రికెట్ లో బాగా పాపులర్ అయిన ఈ పదం అందరికీ సుపరిచితమే.. వర్షం కారణంగా మ్యాచ్‌లు మధ్యలోనే ఆగినప్పుడు, తిరిగి లక్ష్యాన్ని నిర్దేశించడానికి, విజేతలను నిర్ణయించడానికి ఈ పద్థతిని వాడుతారన్న సంగతి మనకు తెలిసిందే. కగా, అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని పరిచయం చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్(78) కన్నుమూశారు. […]
2011 ఏప్రిల్ 2 మధ్యాహ్న వేళ క్రికెట్ ప్రేమికులతో కిటకిటలాడుతున్న ముంబైలోని వాంఖేడే స్టేడియం.భారత క్రికెట్ అభిమానులలో నరాలు తెగేటంత ఉత్కంఠత.ఎక్కడో మనసులో ఏదో మూలలో గెలుపుపై సంశయం.1996 ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో భారత్‌పై శ్రీలంక ఆధిపత్యం వహించిన ఆనాటి దృశ్యం కళ్ళ ముందు మెదిలాడగా గెలుపుపై బెంగ ఒకవైపు.కానీ భారత్-శ్రీలంక జట్లు ఐసీసీ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్లో తలపడటం మొదటిసారి కావడంతో గెలుపు భారత్‌దే అన్న ధీమా మరోవైపు. అయితే […]
మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌పై ఆసీస్ 85 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టోర్నీ ఆరంభం నుంచి తమ అద్భుత బౌలింగ్ ప్రతిభతో భారత్‌ను అంతిమ పోరుకు చేర్చిన బౌలర్లు ఫైనల్లో చేతులెత్తేశారు. ఈ ఓటమితో వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తూ తొలిసారి ఫైనల్‌కి చేరిన భారత్ ప్రపంచకప్‌ను చేజిక్కించుకోవాలనే ఆకాంక్ష ఆవిరైంది. 2010, 2012, 2014లలో హ్యాట్రిక్ గా […]
మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌పై ఆసీస్ 85 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టోర్నీ ఆరంభం నుంచి తమ అద్భుత బౌలింగ్ ప్రతిభతో భారత్‌ను అంతిమ పోరుకు చేర్చిన బౌలర్లు ఫైనల్లో చేతులెత్తేశారు. ఈ ఓటమితో వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తూ తొలిసారి ఫైనల్‌కి చేరిన భారత్ ప్రపంచకప్‌ను చేజిక్కించుకోవాలనే ఆకాంక్ష ఆవిరైంది.2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు ప్రపంచకప్‌ను […]
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళా టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. నిన్నటితో లీగ్ దశ ముగియడంతో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి.భారత్,ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికాతో పాటు ఇంగ్లాండ్ నాకౌట్ పోరుకు సిద్ధమవుతున్నాయి. రేపు సిడ్నీ మైదానంలో మహిళల టీ20 ప్రపంచకప్ రెండూ సెమీస్ మ్యాచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి జరగనున్నాయి.నాలుగు వరుస విజయాలతో అందరికంటే ముందుగా సెమీస్‌లో భారత్ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్-బిలో సౌతాఫ్రికా అగ్రస్థానం దక్కించుకోగా ఇంగ్లాడ్ రెండో స్థానానికి పరిమితమైంది. రేపు జరిగే తొలి సెమీఫైనల్లో […]