iDreamPost
android-app
ios-app

Jay Shah: జైషా ఏం చెబితే అదే వింటున్నారు.. వాళ్లంతా కుక్కలు: పాక్ దిగ్గజం

  • Published Jul 23, 2024 | 9:44 PM Updated Updated Jul 23, 2024 | 9:44 PM

బీసీసీఐ సెక్రెటరీ జైషాను టార్గెట్ చేసుకొని ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలకు దిగాడు. వాళ్లంతా షా మాటే వింటున్నారంటూ సీరియస్ అయ్యాడు.

బీసీసీఐ సెక్రెటరీ జైషాను టార్గెట్ చేసుకొని ఓ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలకు దిగాడు. వాళ్లంతా షా మాటే వింటున్నారంటూ సీరియస్ అయ్యాడు.

  • Published Jul 23, 2024 | 9:44 PMUpdated Jul 23, 2024 | 9:44 PM
Jay Shah: జైషా ఏం చెబితే అదే వింటున్నారు.. వాళ్లంతా కుక్కలు: పాక్ దిగ్గజం

జైషా.. క్రికెట్ దునియాలో మోస్ట్ పవర్​ఫుల్​ పేర్లలో ఒకటి. భారత క్రికెట్ బోర్డు సెక్రెటరీగా ఉన్న షా.. తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించాడు. ఇండియన్ క్రికెట్​కు సంబంధించిన అనేక వ్యవహారాలను చక్కదిద్దుతూ మంచి కార్యదక్షత కలిగిన వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. బోర్డుకు ఛైర్మన్ ఉన్నా గానీ షానే ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తున్నాడు. టీమిండియా ప్లేయర్లతో సన్నిహితంగా ఉండటం, బోర్డు నిర్ణయాలపై మీడియాలో మాట్లాడటం, భారత మ్యాచులకు హాజరవుతుండటం ద్వారా ఆయన లైమ్​లైట్​లో ఉంటూ వస్తున్నాడు. మెన్ ఇన్ బ్లూకు వరల్డ్ కప్ ట్రోఫీని అందజేసిన వారిలో షా ఒకరు. మన దేశ క్రికెట్ వ్యవహారాలను చూసుకుంటూనే.. ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో కూడా ఆయన మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు.

ఐసీసీలో కూడా జైషా మాటకు ఎదురు లేదని క్రికెట్ వర్గాలు అంటుంటాయి. ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్​లో భారత్ పెత్తనం నడుస్తూ వస్తోంది. బీసీసీఐ మాటకు అక్కడ ఎదురుండదు. ఈ బలంతోనే తమకు వ్యతిరేకంగా పని చేసే ఇతర దేశాలను భారత్ అడ్డుకుంటోంది. ఇదే క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో తమకు అడ్డుపుల్ల వేస్తున్న పాకిస్థాన్​ను కూడా సమర్థంగా ఎదుర్కొంటోంది. ఈ టోర్నీ కోసం తమ దేశానికి రాకపోతే టీమిండియాను తీసేసి ఇంకో టీమ్​ను సెలెక్ట్ చేయాలని అడ్డగోలు స్టేట్​మెంట్స్ ఇస్తోంది పాక్. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ భారత బోర్డును, జైషాను టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగాడు. షా చెప్పినట్లు ఐసీసీ వింటోందని అన్నాడు.

ఐసీసీలో బీసీసీఐ పెత్తనం నడుస్తోందని బాసిత్ అలీ అన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా సహా మరో మూడ్నాలుగు దేశాలు జైషా ఏం చెబితే అదే వింటున్నాయని ఇన్​డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. అవన్నీ కుక్కలు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘ఆ ఐదారు క్రికెట్ బోర్డులు షా ఏం చెబితే దానికే ఓకే చెబుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్​లో వద్దంటే సరే అంటాయి. కాదు, అక్కడే టోర్నీ జరపాలని ఆయన అన్నా దానికీ ఎస్ చెబుతాయి. ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్​లో నిర్వహించాలంటే దానికి కూడా తలూపుతాయి. ఎందుకంటే.. ఇంగ్లండ్, ఆసీస్, వెస్టిండీస్, న్యూజిలాండ్​ ప్లేయర్లు వెళ్లి ఐపీఎల్​లో ఆడుతున్నారు. అందుకోసం ఆయా బోర్డులకు బీసీసీఐ నుంచి భారీ మొత్తం అందుతోంది’ అని బాసిత్ అలీ స్పష్టం చేశాడు. మరి.. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాక్ ఓవరాక్షన్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.