Nidhan
India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్‌తో హైలైట్‌గా నిలిచాడు.
India vs Sri Lanka: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్‌తో హైలైట్‌గా నిలిచాడు.
Nidhan
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక లంక బౌలర్ డిఫరెంట్ బౌలింగ్‌తో హైలైట్‌గా నిలిచాడు. సాధారణంగా ఏ బౌలర్ అయినా కుడి చేతితో బౌలింగ్ చేస్తారు లేదా ఎడమ చేతితో బౌలింగ్ చేస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో లంక స్పిన్నర్ కమిందు మెండిస్ మాత్రం రెండు చేతులతో బంతులు వేసి అందర్నీ విస్మయానికి గురిచేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసేందుకు వచ్చిన మెండిస్.. ఇద్దరు బ్యాటర్లను తికమక పెట్టాడు. సూర్యకుమార్ యాదవ్‌కు లెఫ్టాండ్‌తో బౌలింగ్ చేసిన కమిందు మెండిస్.. రిషబ్ పంత్‌కు మాత్రం రైట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేశాడు.
సాధారణంగా కుడి చేతి వాటం బ్యాటర్లను ఎడమ చేతి స్పిన్నర్లు ఇబ్బంది పెడుతుంటారు. అదే సమయంలో ఎడమ చేతి బ్యాటర్లను కుడి చేతి వాటం బౌలర్లు చికాకు పెడతారు. అందుకే సూర్య కోసం లెఫ్టాండ్‌తో బౌలింగ్ చేస్తూ బంతుల్ని బయటకు తీసుకెళ్లిన మెండిస్.. పంత్‌కు కూడా అలాగే బౌలింగ్ చేసి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. కమిందు బౌలింగ్ చూసిన నెటిజన్స్ ఇలా రెండు చేతులతో బౌలింగ్ చేయడం కరెక్టేనా అని అనుమానిస్తున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇది సరైనదే. నిబంధనల ప్రకారం బౌలర్ ఏ చేతితోనైనా బౌలింగ్ చేయొచ్చు, ఇందులో తప్పేమీ లేదు. అయితే బంతి వేసే ముందు అంపైర్‌కు సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఈ విషయం బ్యాటర్‌కు చెబుతాడు అంపైర్. ఇలా బౌలింగ్ చేసే టాలెంట్ చాలా అరుదు. మరి.. కమిందు మెండిస్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Kamindu Mendis bowling left arm to Suryakumar Yadav and right arm to Rishabh Pant. 😄👌 pic.twitter.com/ZBBvEbfQpS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2024