SNP
Praveen Jayawickrama, Match Fixing, ICC: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై ఐసీసీ చర్యలకు సిద్ధమైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అతన్ని కూడా నిందితుడిగా పేర్కొంటూ మూడు అభియోగాలు మోపింది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Praveen Jayawickrama, Match Fixing, ICC: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై ఐసీసీ చర్యలకు సిద్ధమైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అతన్ని కూడా నిందితుడిగా పేర్కొంటూ మూడు అభియోగాలు మోపింది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
SNP
తాజాగా పటిష్టమైన టీమిండియాపై మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో గెలిచి సంతోషంలో ఉన్న శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీలంక యువ క్రికెటర్ ప్రవీణ్ జయవిక్రమను నిందితుడిగా పేర్కొంటూ, అతను మూడు నిబంధనలను ఉల్లఘించినట్లు వెల్లడించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. లంక ప్రీమియర్ లీగ్ 2021 కంటే ముందు.. బూకీలు జయవిక్రమను మ్యాచ్ ఫిక్సింగ్ కోసం సంప్రదించారు. లంక ప్రీమియర్ లీగ్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని బూకీలు కోరారు. అందుకోసం భారీగా డబ్బు ఆశచూపించారు. అయితే.. ఈ విషయం ఎలాగోలా బయటపడింది. దీనిపై ఐసీసీ విచారణ జరిపి.. ప్రవీణ్ జయవిక్రమను కూడా నిందితుడిగా పేర్కొంది.
ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌లోని ఆర్టికల్ 2.4.4 ప్రకారం బుకీలు తనన సంప్రదించిన విషయాన్ని వెంటనే యాంటీ కరప్షన్ యూనిట్‌కు తెలియజేయకుండా.. అకారణంగా ఆలస్యం చేశాడు. అలాగే అదే ఆర్టికల్ 2.4.4 కింద మ్యాచ్ ఫక్సింగ్‌కు పాల్పడాల్సిందిగా బుకీలు మరో ఆటగాడిని కూడా సంప్రదించాలని జయవిక్రమను కోరారు. ఆ విషయాన్ని కూడా ఏసీయూకు తెలియజేయకుండా సరైన కారణం లేకుండా ఆలస్యం చేశాడు. ఇక ఆర్టికల్ 2.4.7 ప్రకారం.. బుకీలు చేసిన మేసేజులను డిలీట్ చేశాడు. ఇది దర్యాప్తును అడ్డుకోవడం కింది వస్తుందని ఐసీసీ పేర్కొంది. ఇలా ఈ మూడు ఛార్జ్‌లను ప్రవీణ్ జయవిక్రమపై మోపింది.
వీటికి ఈ నెల 20లోపు సరైన సమాధానం చెప్పాలని ఆదేశించింది. అతను ఇచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ఐసీసీ వెల్లడించింది. ఒక వేళ జయవిక్రమపై నేరం రుజువైతే.. అతనిపై కొన్ని ఏళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. ఐసీసీ తీసుకునే చర్యలు అంతర్జాతీయ క్రికెట్‌కే కాక.. లంక ప్రీమియర్ లీగ్‌కు వర్తిస్తాయని సమాచారం. ఇక శ్రీలంక తరఫున 5 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు ఆడాడు జయవిక్రమ. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన జయవిక్రమ టెస్టుల్లో 25, వన్డేల్లో 5, టీ20ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 Sri Lankan left-arm spinner Praveen Jayawickrama has been accused of violating the ICC’s anti-corruption code on three counts. pic.twitter.com/cr2z6gmUtn
— CricketGully (@thecricketgully) August 8, 2024