iDreamPost
android-app
ios-app

Darius Visser: టీ20ల్లో ప్రపంచ రికార్డు.. ఓకే ఓవర్లో ఏకంగా 39 పరుగులు!

  • Published Aug 20, 2024 | 1:13 PM Updated Updated Aug 20, 2024 | 1:13 PM

ఇంటర్నేషనల్ టీ20ల్లో సరికొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ అయ్యింది. ఒకే ఓవర్లో ఆరు సిక్సులతో సహా మెుత్తం 39 పరుగులు వచ్చాయి. దాంతో ఇది సరికొత్త రికార్డుగా నమోదు అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇంటర్నేషనల్ టీ20ల్లో సరికొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ అయ్యింది. ఒకే ఓవర్లో ఆరు సిక్సులతో సహా మెుత్తం 39 పరుగులు వచ్చాయి. దాంతో ఇది సరికొత్త రికార్డుగా నమోదు అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

Darius Visser: టీ20ల్లో ప్రపంచ రికార్డు.. ఓకే ఓవర్లో ఏకంగా 39 పరుగులు!

క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అన్న సామెత అందరికీ తెలిసిందే. ఇవ్వాల నమోదు అయిన రికార్డు, గంటల్లోనే బద్దలు కావొచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా జరిగే క్రికెట్ మ్యాచ్ ల్లో రోజూ ఏదో ఒకమూల ఏదో ఒక రికార్డు నమోదు అవ్వడమో.. బ్రేక్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. తాజాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ప్రపంచ రికార్డు క్రియేట్ అయ్యింది. ఓ బౌలర్ ఒకే ఓవర్లో ఏకంగా 39 పరుగులు సమర్పించుకున్నాడు. మరి ఆ మ్యాచ్ ఏది? ఆ బౌలర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

ఇంటర్నేషనల్ టీ20ల్లో సరికొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ అయ్యింది. ICC పురుషుల టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫయర్ ఏ మ్యాచ్ లో భాగంగా వనాటు వర్సెస్ సమోవా దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రపంచ రికార్డు నమోదు అయ్యింది. వనాటు బౌలర్ అయిన నలిన్ నిపికో వేసిన ఓ ఓవర్లో సమోవా బ్యాటర్ డేరియస్ విస్సర్ ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. దానికి తోడు అతడు మూడు నో బాల్స్ వేయడంతో.. ఈ ఓవర్లో మెుత్తం 39 పరుగులు వచ్చాయి. దాంతో ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ లో సరికొత్త ప్రపంచ రికార్డుగా నమోదు అయ్యింది.

కాగా.. 2007 టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 2021లో శ్రీలంక బౌలర్ అఖిల ధనుంజయ బౌలింగ్ లో కీరన్ పొలార్డ్ ఆరు సిక్సర్లు కొట్టాడు. కమ్రాన్ ఖాన్ బౌలింగ్ లో దీపేంద్ర సింగ్ ఎయిరీ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించాడు. కానీ ఇప్పుడు ఆరు సిక్సర్లతో పాటుగా ఏకంగా 39 పరుగులు రావడం సరికొత్త చరిత్ర. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో డేరియస్ విస్సర్ 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు. అందులో ఏకంగా 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఒక టీ20 మ్యాచ్ లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గానూ విస్సర్ నిలిచాడు. అలాగే సమోవా దేశం తరఫున సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా ఘనతకెక్కాడు.