iDreamPost
android-app
ios-app

BCCI సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నిర్వహణకు నో చెప్పిన బోర్డు! కారణం?

  • Published Aug 15, 2024 | 3:21 PM Updated Updated Aug 15, 2024 | 3:21 PM

Women's T20 World Cup 2024: భారత క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బోర్డు డెసిషన్​ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Women's T20 World Cup 2024: భారత క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బోర్డు డెసిషన్​ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Published Aug 15, 2024 | 3:21 PMUpdated Aug 15, 2024 | 3:21 PM
BCCI సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నిర్వహణకు నో చెప్పిన బోర్డు! కారణం?

క్రికెట్​లో దైపాక్షిక సిరీస్​లు ఎన్ని నిర్వహించినా రాని పేరు, గుర్తింపు, ఆదాయం.. ఒక్క ఐసీసీ టోర్నమెంట్​తో వస్తుంది. టూరిస్టుల ద్వారా వచ్చే ఇన్​కమ్​తో పాటు టికెట్ సేల్స్ తదితర రూపంలో భారీ మొత్తంలోనే ఆదాయం సమకూరుతుంది. అందుకే ఐసీసీ టోర్నీల నిర్వహణ కోసం అన్ని క్రికెటింగ్ నేషన్స్ పోటీపడతాయి. అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం పోటీపడకుండానే ఓ మెగా ఈవెంట్ నిర్వహణ అవకాశాన్ని దక్కించుకుంది. వరల్డ్ కప్​ను నిర్వహించమంటూ భారత్​కు ఛాన్స్ వచ్చింది. కానీ అందుకు బీసీసీఐ ససేమిరా నో చెప్పింది. ప్రపంచ కప్ లాంటి బడా టోర్నీ నిర్వహణ అవకాశం వస్తే ఎవరూ కాదనుకోరు. కానీ మన బోర్డు మాత్రం దీనికి నో చెప్పింది. దీంతో ఎందుకిలా చేస్తోందని అంతా ఆలోచనల్లో పడ్డారు.

విమెన్స్ టీ20 వరల్డ్ కప్-2024 టోర్నమెంట్ బంగ్లాదేశ్​లో జరగాల్సింది. సెప్టెంబర్ నుంచి ఈ టోర్నీ మొదలవ్వాల్సి ఉంది. కానీ ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో పొట్టి కప్పు నిర్వహణ సందిగ్ధంలో పడింది. తమ దేశంలో సిచ్యువేషన్ బాగోకపోవడంతో మహిళల ప్రపంచ కప్​ను భారత్​లో నిర్వహించమంటూ బీసీసీఐని బంగ్లా బోర్డు కోరింది. కానీ మెగా టోర్నీ ఆతిథ్యానికి భారత బోర్డు నో చెప్పిందని తెలుస్తోంది. బంగ్లా బోర్డు రిక్వెస్ట్​ను బీసీసీఐ సెక్రెటరీ జైషా తిరస్కరించారని సమాచారం. వచ్చే సీజన్​లో డొమెస్టిక్ క్రికెట్​తో పాటు టీమిండియా సిరీస్​లు కూడా ఉన్నాయి. అలాగే వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచ కప్ కూడా ఇక్కడే జరగనుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని బంగ్లా ఆఫర్​కు జైషా నో చెప్పారని వినిపిస్తోంది.

BCCI sensational decision

మహిళల టీ20 వరల్డ్ కప్​తో పాటు విమెన్స్ వన్డే ప్రపంచ కప్ కూడా ఇక్కడే నిర్వహిస్తే బ్యాక్ టు బ్యాక్ రెండు మెగా టోర్నీలు భారత్​లోనే జరిగాయనే అపవాదు వస్తుందనేది బీసీసీఐ ఆలోచనట. అలాగే నెక్స్ట్ దులీప్ ట్రోఫీ, బంగ్లాదేశ్ సిరీస్.. ఇలా ఎడతెరపిలేని క్రికెట్ ఉంది కాబట్టి మధ్యలో వరల్డ్ కప్ అంటే తీవ్ర ఒత్తిడి పడుతుందనే ఉద్దేశంతోనూ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. బీసీసీఐ నో చెప్పిన నేపథ్యంలో విమెన్స్ టీ20 వరల్డ్ కప్​కు ఎవరు ఆతిథ్యం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్​లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఐసీసీ.. మెగా టోర్నీ నిర్వహణ కోసం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి. మరి.. వరడ్డ్ కప్ నిర్వహణకు బీసీసీఐ నో చెప్పడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.