iDreamPost
android-app
ios-app

Champions Trophy 2025: పాక్ తో కలిసి టీమిండియాకు షాకిచ్చిన ICC! ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం కష్టమేనా?

  • Published Sep 16, 2024 | 8:27 AM Updated Updated Sep 16, 2024 | 8:27 AM

Champions Trophy 2025, Pakistan, Team India: ఐసీసీతో కలిసి పాకిస్థాన్ టీమిండియాకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాల్గొనడం కష్టంగానే కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Champions Trophy 2025, Pakistan, Team India: ఐసీసీతో కలిసి పాకిస్థాన్ టీమిండియాకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాల్గొనడం కష్టంగానే కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Champions Trophy 2025: పాక్ తో కలిసి టీమిండియాకు షాకిచ్చిన ICC! ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం కష్టమేనా?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జరగనున్నప్పటికీ అందరి దృష్టి దీనిపైనే ఉంది. పాకిస్థాన్ వేదికగా జరగబోయే ఈ టోర్నీలో భారత్ తో సహా 8 జట్లు పాల్గొననున్నాయి. అయితే పాక్ లో టోర్నీ జరుగుతుంది కాబట్టి టీమిండియా అక్కడికి వెళ్తుందా? లేదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. భారత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే మా నిర్ణయం చెబుతామని బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం మేరకు పాక్ తో కలిసి టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందా? లేదా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే టీమిండియా ఆటగాళ్లు పాక్ గడ్డపై అడుగుపెడతారని బీసీసీఐ చెబుతోంది. ఇక భారత్ ఎలాగైనా పాక్ లో ఆడాల్సిందే అని పట్టుబడుతోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఒక వేళ టీమిండియా పాక్ కు రావడానికి ఇష్టం లేకపోతే.. హైబ్రిడ్ మోడల్ లో తటస్థ దేశాల్లో మ్యాచ్ లను నిర్వహించాలన్న ఆలోచనలో కూడా ఐసీసీ ఉంది. అయితే ఇందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించాల్సి ఉంది. టీమిండియా పాక్ కు రాకపోతే.. టోర్నీ వేరే దేశానికి తరలిపోతుందన్న వార్తలపై తాజాగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జియోఫ్ అల్లార్డిస్ స్పందించారు.

పాకిస్థాన్ లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఇతర దేశాలకు తరలించే ఆలోచన లేదని, ఈ టోర్నీ పాక్ లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దాంతో టీమిండియా ఈ మెగా టోర్నీ ఆడటం కష్టమేనా? అంటూ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇక తటస్థ దేశాల్లో భారత్ ఆడే మ్యాచ్ లు నిర్వహించాలని ఐసీసీ ఆలోచిస్తున్నప్పటికీ.. అందుకు పాకిస్థాన్ ఒప్పుకోవడం లేదు. ఇన్ని అవాంతరాల మధ్య ఈ మెగా టోర్నీ టీమిండియా ఆడుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాక్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతందని ఐసీసీ చీఫ్ చెప్పడంతో.. ఐసీసీతో కలిసి పాక్ భారత్ కు దెబ్బేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.