iDreamPost
android-app
ios-app

పాకిస్తాన్ కు షాకిచ్చిన ICC!  భారత్ అంటే ఆ మాత్రం ఉంటది మరి..

  • Published Jul 25, 2024 | 8:08 PM Updated Updated Jul 25, 2024 | 8:08 PM

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కు ఐసీసీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. 8 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీ పాక్ వేదికగా జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీబీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కు ఐసీసీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. 8 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీ పాక్ వేదికగా జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీబీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ కు షాకిచ్చిన ICC!  భారత్ అంటే ఆ మాత్రం ఉంటది మరి..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్తాన్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. 8 దేశాలు పాల్గొనే ఈ టోర్నీని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ భావించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి అందజేసింది. టోర్నీ పాక్ లో జరుగుతున్నందున అక్కడికి వెళ్లడానికి టీమిండియా నిరాకరించింది. భారత్ ఆడే అన్ని మ్యాచ్ లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని, దుబాయ్ లేదా శ్రీలంకలో జరపాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కు ఐసీసీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించేందుకు ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 8 దేశాలు పాల్గొనే ఈ టోర్నీని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించాలని పీసీబీ భావించింది. ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ ను కూడా సిద్ధం చేసి ఐసీసీకి అందజేసింది. అయితే ఐసీసీ మాత్రం ఈ మెగాటోర్నీని హైబ్రిడ్ మోడల్ పద్ధతిలోనే నిర్వహించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దాంతో పాకిస్తాన్ కు షాక్ తగిలినట్లు అయ్యింది. 2023 ఆసియా కప్ ను కూడా ఇదే పద్దతిలో, శ్రీలంక వేదికగా నిర్వహించింది ఐసీసీ. ఇప్పుడు కూడా ఇలాగే ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని చూస్తోంది. భారత్ కూడా పాక్ లో మ్యాచ్ లు జరిగితే అక్కడికి రాబోమని తేల్చి చెప్పింది.

అయితే ఇలా తటస్థ వేదికల్లో మ్యాచ్ లు జరిపితే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని పాక్ చెప్పుకొస్తోంది. టీమిండియా ఆడే మ్యాచ్ లన్నీ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తామని ఐసీసీకి తెలిపింది పీసీబీ. ఇదిలా ఉండగా.. ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో వేరే దేశాల్లో మ్యాచ్ లు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లను చేస్తోందని సమాచారం. తటస్థ వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించడానికి కావాల్సిన బడ్జెట్ ను కేటాయించింది. అయితే టీమిండియాను పాక్ కు రప్పించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తామని, లేని పక్షంలో హైబ్రిడ్ మోడల్ లోనే టోర్నీని నిర్వహిస్తామని ఐసీసీ పేర్కొంది. కానీ.. భారత్ ను కాదని ఈ టోర్నీని నిర్వహిస్తే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కు ఐసీసీకి తీవ్ర నష్టం వస్తుందన్నది కాదనలేని సత్యం. ఇండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది మరి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.