iDreamPost
android-app
ios-app

ఫిక్సింగ్ కలకలం.. ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్​పై 5 ఏళ్ల పాటు బ్యాన్!

  • Published Aug 07, 2024 | 3:15 PM Updated Updated Aug 07, 2024 | 3:15 PM

Ihsanullah Janat: ఫిక్సింగ్ అనే పదం వింటేనే క్రికెట్ లవర్స్ భయపడతారు. అంతగా ఈ ఆటపై అది ప్రభావం చూపింది. ఈ ఊబిలో పడి చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్​ను నాశనం చేసుకున్నారు.

Ihsanullah Janat: ఫిక్సింగ్ అనే పదం వింటేనే క్రికెట్ లవర్స్ భయపడతారు. అంతగా ఈ ఆటపై అది ప్రభావం చూపింది. ఈ ఊబిలో పడి చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్​ను నాశనం చేసుకున్నారు.

  • Published Aug 07, 2024 | 3:15 PMUpdated Aug 07, 2024 | 3:15 PM
ఫిక్సింగ్ కలకలం.. ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్​పై 5 ఏళ్ల పాటు బ్యాన్!

ఫిక్సింగ్.. ఈ పదం వింటేనే క్రికెట్ లవర్స్ భయపడతారు. అంతగా ఈ ఆటపై అది ప్రభావం చూపింది. ఈ ఊబిలో పడి చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్​ను నాశనం చేసుకున్నారు. లెజెండ్స్ స్థాయికి చేరాల్సిన కొందరు ఆటగాళ్లు కాస్తా ఫిక్సింగ్ వల్ల ద్రోహులుగా మిగిలిపోయారు. స్టార్లుగా గేమ్​ను ముందుకు నడపాల్సిన యంగ్ ప్లేయర్లు దీని మాయలో పడి క్రికెట్​కు దూరమైపోయారు. డబ్బుల వ్యామోహంలో పడి ఫిక్సింగ్​కు పాల్పడి అభిమానుల ముందు దోషులుగా నిలబడ్డారు. ఆ దేశం, ఈ దేశం అని ఏమీ లేదు.. చాలా కంట్రీస్ ప్లేయర్లు దీని బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇప్పుడు మరో క్రికెటర్ ఈ లిస్ట్​లో చేరాడు.

ఆఫ్ఘానిస్థాన్ టాపార్డర్ బ్యాటర్ ఇసానుల్లా జనత్​పై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు తేలడంతో అతడ్ని ఏకంగా 5 ఏళ్ల పాటు బ్యాన్ చేసింది. అన్ని రకాల క్రికెటింగ్ యాక్టివిటీస్ నుంచి అతడ్ని దూరం పెడుతున్నట్లు ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది. తాను మ్యాచ్ ఫిక్సింగ్​కు పాల్పడ్డానని ఏసీబీతో పాటు ఐసీసీ అవినీతి నిరోధక అధికారుల ముందు అతడు ఒప్పుకున్నాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) సీజన్ 2 టైమ్​లో ఫిక్సింగ్​ జరిగిందని ఏసీబీ విచారణలో అతడు అంగీకరించాడు. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ ఆర్టికల్ 2.1.1 కింద జనత్​పై నిషేధం విధించామని ఆఫ్ఘాన్ బోర్డు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Ihsan Jannath

ఆఫ్ఘాన్ క్రికెట్​కు సంబంధించిన అన్ని వ్యవహారాల నుంచి జనత్​ను దూరం పెడుతున్నామని.. ఐదేళ్ల పాటు అతడిపై నిషేధం అమల్లో ఉంటుందని ఏసీబీ పేర్కొంది. ఇంటర్నేషనల్ సిరీస్​లతో పాటు దేశీయంగా నిర్వహించే కాబుల్ ప్రీమియర్ లీగ్ ద్వారా సొంత ఆదాయాన్ని పెంచుకోవడం, అలాగే దేశంలోని యంగ్​స్టర్స్​కు మరిన్ని అవకాశాలు దక్కేలా చేయాలని అనుకుంటున్న ఆఫ్ఘాన్ బోర్డుకు ఈ ఫిక్సింగ్ ఉదంతం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఫిక్సింగ్ వల్ల కేపీఎల్​ ఫ్యూచర్​పై ఎఫెక్ట్ పడటం ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఇక, జనత్ ఒకడే కాదు.. ఈ ఫిక్సింగ్ ఉదంతంలో మరో ముగ్గురు క్రికెటర్లకు కూడా భాగస్వామ్యం ఉందని, దీనికి సంబంధించిన విచారణను మరింత వేగవంతం చేశామని ఆఫ్ఘాన్ బోర్డు అఫీషియల్ స్టేట్​మెంట్​లో స్పష్టం చేసింది. మరి.. క్రికెట్​లో మళ్లీ ఫిక్సింగ్ కలకలం రేపడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.