iDreamPost
android-app
ios-app

భారత్​ వేదికగా ఆసియా కప్.. 34 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

  • Published Jul 29, 2024 | 5:48 PM Updated Updated Jul 29, 2024 | 5:48 PM

ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ముగిసింది. అయితే ఇక్కడితో ఐసీసీ టోర్నీలు అయిపోలేదు. వచ్చే మూడేళ్లలో ఏకంగా 7 బడా ఈవెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటైన ఆసియా కప్​కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు ఇంకా ఏయే టోర్నీలకు ఇండియా హోస్ట్ కంట్రీగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ముగిసింది. అయితే ఇక్కడితో ఐసీసీ టోర్నీలు అయిపోలేదు. వచ్చే మూడేళ్లలో ఏకంగా 7 బడా ఈవెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటైన ఆసియా కప్​కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు ఇంకా ఏయే టోర్నీలకు ఇండియా హోస్ట్ కంట్రీగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 29, 2024 | 5:48 PMUpdated Jul 29, 2024 | 5:48 PM
భారత్​ వేదికగా ఆసియా కప్.. 34 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

ప్రస్తుతం అన్ని క్రికెట్ టీమ్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ షెడ్యూల్ అలా ఉంది. దాదాపుగా ప్రతి జట్టు ఏదో ఒక సిరీస్​లో ఆడుతూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తున్నాయి. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ రూపంలో ప్రేక్షకులకు మస్తు వినోదం అందింది. అయితే ఇక్కడితే అయిపోలేదు. వచ్చే మూడేళ్లలో ఏకంగా 7 బడా ఈవెంట్స్ జరగనున్నాయి. అందులో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీలు ఐదు ఉండటం విశేషం. వీటితో పాటు రెండు ఆసియా కప్​లు కూడా జరగనున్నాయి. ఒక ఆసియా కప్​కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిగతా ఆసియా కప్​తో పాటు ఇతర ఐసీసీ టోర్నీలు ఎక్కడ జరగనున్నాయి? హోస్ట్ నేషన్స్ ఏవి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్​లో జరిగే ఈ టోర్నమెంట్​కు దాయాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాలు, సరిహద్దు వివాదాల కారణంగా అక్కడ ఆడమని భారత్ అంటోంది. దీనిపై ఐసీసీ తేల్చేదాకా ఏ విషయమూ చెప్పలేం. ఇక, వచ్చే ఏడాది మరో ఐసీసీ ఈవెంట్ జరగనుంది. అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్. దీనికి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో మరో కీలక టోర్నమెంట్ జరగనుంది. అదే ఆసియా కప్. భారత్ హోస్ట్​గా ఉన్న ఈ టోర్నీ టీ20 ఫార్మాట్​లో జరగనుంది. ఆ టోర్నమెంట్​కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం 34 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనిపై తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

2026లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి భారత్​-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్-2027 ఎక్కడ జరుగుతుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై ఐసీసీ స్పష్టత ఇచ్చే దాకా ఏదీ చెప్పలేం. అదే ఏడాది జరిగే ఆసియా కప్​కు బంగ్లాదేశ్ హోస్ట్​గా ఉండనుంది. ఈ టోర్నీని వన్డే ఫార్మాట్​లో నిర్వహించనున్నారు. ఇక, వన్డే ప్రపంచ కప్-2027కు ఆఫ్రికా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా హోస్ట్ కంట్రీస్​గా ఉంటాయి. మరి.. ఇందులో ఏ టోర్నీ కోసం మీరు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.