విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ నేతల్లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఒకరు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తనదైన శైలిలో కొత్త పుంతలు తొక్కించేందుకు గంటా శ్రీనివాసరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఆయన అనేక రాజకీయ ప్రతిపాదనలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అందరికన్నా ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా.. తన స్థానంలో ఉద్యమానికి […]
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం రాజుకుంటోంది. ప్రజా ప్రతినిధులను కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన గంటా శ్రీనివాసరావు చివరకు కార్మికుల ఒత్తిడితో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా సమర్పించారు. దాంతో టీడీపీ ఖాతా నుంచి మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. ఇప్పటికే గెలిచిన 23 మందిలో నలుగురు బాబుని వ్యతిరేకిస్తున్నారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలాం, వాసుపల్లి గణేష్ నేరుగా జగన్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం మరో […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రం స్పీకర్ స్పీకర్ ఫార్మేట్లో ఉందా..? లేదా..? గంటా రాజీనామా సీరియస్‌గానే చేశారా..? లేదా..? అనే విషయాలు పక్కనపెడితే.. ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా అస్త్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, గుంటూరు, కృష్ణా జిల్లాలోని టీడీపీ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచిందనేది […]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మొత్తబడ్డారు. టీడీపీ అధినేత బుజ్జగింపులతో దారికొచ్చినట్టే కనిపిస్తోంది. సుమారు రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ టీడీపీ సమావేశానికి పూనుకున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి క్యాడర్ తో సమావేశమయ్యి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాంతో కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా పునర్ధర్శనం విశేషంగా మారుతోంది. వాస్తవానికి గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ ఫిరాయిస్తున్నారనే ప్రచారం చాలాకాలంగా. ఆయన ప్రయత్నాలు ఆ రీతిలో సాగాయి. నేరుగా బీజేపీ […]
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి అంతా సిద్ధమయ్యింది. ఈనెల 25న దానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఈవిషయాన్ని ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ప్రత్యూషా కంపెనీ పేరుతో తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ఈ చర్యకు పూనుకుంటున్నారు. ఇప్పటికే వాటికి సంబంధిచిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 2016లోనే ఇండియన్ బ్యాంక్ అధికారులు దానికి అనుగుణంగా ప్రకటనలు చేశారు. గంటా శ్రీనివాసరావుకి చెందిన ప్రత్యుషా రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రై. లిమిటెడ్ పేరుతో ఇండియన్ బ్యాంకు […]
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి అక్కడ ఏమి జరిగినా.. సంచలనమే అవుతోంది. వార్తలో పతాక శీర్షికల్లో నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రాజకీయ పార్టీలు అత్యంత వేగంగా స్పందిస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న విశాఖలో మరో నెల రోజుల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణంపై వేసిన సిట్.. తన దర్యాప్తును మరో నెల రోజుల్లో పూర్తి చేయనుంది. నవంబర్ నెలాఖరుకు దర్యాప్తు […]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ చర్చనీయాంశమే. రాజకీయంగా ఆయన నిర్ణయాలు ఆసక్తికరమే. ఉపాధి కోసం విశాఖ వెళ్లి, ఆంధ్రభూమి పత్రికలో ఉద్యోగం నుంచి ఓ కాంట్రాక్ట్ సంస్థకు అధినేతగా మారిన ఆయన ప్రస్థానంలో రాజకీయ జీవితం విశేషంగానే చెప్పాలి. టీడీపీ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్, మళ్లీ టీడీపీ ఇలా పలు పార్టీలలో సాగారు. అనకాపల్లి ఎంపీ నుంచి ఎమ్మెల్యే, చోడవరం నుంచి భీమిలి మీదుగా మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి స్వల్ప […]
‘‘సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు పోతాం’’ పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. గతంలో ఆయన ఈ మాట చెప్పినప్పుడల్లా ఏదో చెబుతున్నాడులే అనుకున్నారు. కానీ చంద్రబాబు చెప్పిన మాట అక్షర సత్యమని ఈ రోజు రుజువైంది. సంక్షోభాలను చంద్రబాబు తన రాజకీయానికి అవకాశాలుగా ఎలా మలుచుకుంటారో ఆయన్ను గమనించే వారికి ఈ రోజు బోధపడింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. […]
ప్రభుత్వం పై ఎప్పటిలానే నిరాధార ఆరోపణలు వెనకా ముందు చూడకుండా తనకు నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడడంలో టిడిపి ఎమ్మేల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ముందుంటారు. గతంలో టిడిపి హయాంలో మంత్రిగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిపక్షం మీద ఇష్టానుసారం విరుచుకుపడేవారు.. అధికారం పోయాక కూడా కొన్నాళ్ళు అదే నోటిదురుసుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద, మంత్రుల మీద కామెంట్స్ చేసేవారు.అయితే ఆ తరువాత ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు విషయంలో ఆయన కార్మికమంత్రిగా […]
నేటి రాజకీయాల్లో పాతకాల సాంప్రదాయ వైఖరితో రాణించటం కష్టమని ఓటమితో డాక్టర్ గారికి అర్ధమయింది. పర్చూరు నియోజకవర్గం నుంచి తన ఓటమిని కలలో కూడా ఊహించని డాక్టర్ గారికి వారి సామాజికవర్గ ఓట్లు పడలేదన్న విషయం కూడా అర్ధమైంది. గెలిచినప్పుడే పెద్దగా ప్రజలలో తిరిగే అలవాటు లేని డాక్టర్ గారు ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు. కొడుకు చెంచురామ్ కూడా పెద్దగా జనంలో తిరగడం మానేశారు.మరో వైపు వైసీపీలో కొత్త నాయకులు దూసుకుపోతుండటం మాజీ ఇంచార్జ్ రామనాథం […]