iDreamPost
android-app
ios-app

రఘరామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు షాక్.. ఆస్తుల వేలానికి ప్రకటన!

Raghu Rama krishna Raju, Ganta Srinivasa Rao: రఘురామకృష్ణ రాజు, గంటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి వీరి గురించి బాగానే తెలుసు. ప్రస్తుతం వీరిద్దరు కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఓ గట్టి షాక్ తగిలింది.

Raghu Rama krishna Raju, Ganta Srinivasa Rao: రఘురామకృష్ణ రాజు, గంటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి వీరి గురించి బాగానే తెలుసు. ప్రస్తుతం వీరిద్దరు కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఓ గట్టి షాక్ తగిలింది.

రఘరామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు షాక్.. ఆస్తుల వేలానికి ప్రకటన!

ప్రస్తుతం కాలంలో నోటీసులు అనేవి వివిధ కారణాలతో వస్తుంటాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారికి వచ్చే నోటీసులు ఎక్కువగా వార్తల్లోనిలుస్తుంటాయి. వారి బ్యాంకులకు సంబంధించిన, ఇతర విషయాల్లో నోటీసులు అందుకుంటారు. ముఖ్యంగా బ్యాంకులకు రుణాలు ఎగొడ్డటం వంటి ఘటనలో నోటీసులు జారీ అవుతుంటాయి. తాజాగా ఎన్నికల వేళ టీడీపీ నేతలు రఘురామకృష్ణ రాజు, గంటా శ్రీనివాసరావుకు నోటీసులు అందాయి. మరి.. ఏ విషయంలో, ఎందుకు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రఘురామకృష్ణ రాజు, గంటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి వీరి గురించి బాగానే తెలుసు. ప్రస్తుతం వీరిద్దరు కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఓ గట్టి షాక్ తగిలింది. వీరిద్దరికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేశాయి. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఆస్తుల వేలానికి సంబంధించి వీరిద్దరికి ఆ రెండు సంస్థళు నోటీసులు జారీ చేశాయి. ముందుగా ఎన్ సీఎల్టీ ఇచ్చిన నోటీసుల గురించి చూసినట్లు అయితే తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్ కు చెందిన వివిధ ఆస్తులను విక్రయించేందుకు ఈ సంస్థ నోటీసులు జారీ చేసింది.

ఈ సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తుంది. ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగలిగినవారు జూన్ 13వ తేదీలోపు బిడ్లు దాఖలు చేయాలని ప్రకటనలో పేర్కొంది. ఇక రఘురామకృష్ణ రాజుకు డైరెక్టర్ గా ఉన్న ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్లాంటుకు చెందిన 311 ఎకరాల, కర్ణాటక రాష్ట్రంలోని హాంకాన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఈ సంస్థ వేలం వేస్తున్న ఆస్తుల్లో ఉన్నాయి. అదే విధంగా గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్‌ఫ్రా కంపెనీకి చెందిన ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రత్యూష రిసోర్సెస్ ఇన్‌ఫ్రా కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు రుణం తీసుకుంది. అయితే సకాలంలో రుణాలు చెల్లించలేదని బ్యాంకు పేర్కొంది. ఈ క్రమంలో గంటాకు చెందిన ఈ కంపెనీ ఆస్తులు వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగినవారు బిడ్లు దాఖలు చేసేందుకు జూన్ 7 తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. రుణాల చెల్లింపునకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ చెల్లించకపోవటంతో ఈ రెండు సంస్థలు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.