ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అనారోగ్య కారణాలు చూపుతూ 66 రోజులుగా ఆస్పత్రుల్లో ఉంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు వ్యవహారంలో మరో పరిణామం చోటుచేసుకుంది. గత నెల 8వ తేదీ నుంచి గుంటూరు రమేష్ ఆస్పత్రిలో జుడిషియల్ రిమాండ్‌లో ఉంటున్న అచ్చెం నాయుడుకు కరోనా సోకినట్లు ఆస్పత్రి వైద్యులు హైకోర్టుకు ఇటీవల నివేదించారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన హైకోర్టు.. అచ్చెం నాయుడును మంగళగిరి సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించాలని […]
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడుకి కరోనా సోకింది. 150 కోట్ల రూపాయలు పక్కదారి పట్టిన ఈఎస్ఐ స్కాంలో నిందితుడుగా ఉన్న అచ్చెం నాయుడును జూన్ 12వ తేదీన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫైల్స్ కారణంగా హైకోర్టు ఆదేశాల మేరకు అచ్చెం నాయుడును పోలీసులు గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలించారు. గతనెల 8వ తేదీ నుంచి అచ్చెం నాయుడు రమేష్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అంతకు ముందు వారం రోజులు విజయవాడ […]
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెం నాయుడు ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? రెండు నెలలు అవుతున్నా ఆయన మొలలు ఇంకా తగ్గలేదా..? చేసిన శస్త్రచికిత్స తాలుకూ గాయం ఇంకా మానలేదా..? బెయిల్ వచ్చే వరకు ఆయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలోనే జుడిషియల్ రిమాండ్‌లో ఉంటారా..?.. ఇవీ ప్రస్తుతం అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాంలో అచ్చెం నాయుడు అరెస్ట్ అయి ఈ రోజుకు రెండు నెలలు అవుతోంది. జూన్ 12వ తేదీన అచ్చెం […]
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెం నాయుడు ఇక ఆస్పత్రిని వదలాల్సిన సమయం వచ్చిందా..? జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందా..? అంటే తాజా పరిస్థితులను బట్టి అవుననే సమాధానాలు వస్తున్నాయి. అచ్చెం నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై పలుమార్లు సుదీర్ఘంగా విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఈ రోజు తన నిర్ణయాన్ని వెల్లడించింది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈ కేసులో అచ్చెం నాయుడు భవిష్యత్ ఏమిటి..? అనే అంశంపై ప్రస్తుతం చర్చ […]
ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. ఈ స్కాంలో ఏసీబీ తనను అరెస్ట్ చేస్తుందన్న అంచనాతో పితాని వెంకట సురేష్, పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురళీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను గత గురువారం ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఆ తీర్పును హైకోర్టు ఈ రోజు వెల్లడించింది. పితాని వెంకట సురేష్, మురళీలు దాఖలు చేసిన ముందస్తు […]
ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న 150 కోట్ల రూపాయల విలువైన ఈఎస్ఐ స్కాంలో ప్రస్తుతం దొంగ పోలీస్ ఆట నడుస్తోంది. పక్కా ఆధారాలతో ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ మాజీ మంత్రి అచ్చెం నాయుడు సహా పలువురు మాజీ, తాజా అధికారులను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఇప్పుడు రెండో దఫా వేట మొదలుపెట్టింది. ఈ కేసులో కీలక పాత్ర అని ఏసీబీ నిర్థారించుకున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్, ఆయన మాజీ […]
సంచలనం సృష్టించిన ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ? ఏసిబి కస్టడీలో ఉన్న అచ్చెన్నతో పాటు అప్పటి ఉన్నతాధికారులను ఏసిబి విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏసిబి విచారణలో అచ్చెన్న పెద్దగా సహకరించకపోయినా ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు మాత్రం కుంభకోణానికి సంబంధించిన పూర్తి విషయాలను బయటపెట్టేశారని తెలుస్తోంది. అంటే అరెస్టయిన ఉన్నతాధికారుల సాక్ష్యాలను బట్టి రూ. 157 కోట్ల భారీ కుంభకోణంలో అచ్చెన్నే కీలక సూత్రదారిగా అర్ధమవుతోంది. ఇఎస్ఐ […]
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు ఏసీబీ కస్టడీ ముగిసింది. ఏసీబీ పిటిషన్ మేరకు అచ్చెం నాయుడును మూడు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. గురువారం మొదలైన ఏసీబీ కస్టడీ నేటితో ముగిసింది. మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు అచ్చెం నాయుడును గుంటూరు జీజీహెచ్‌లోనే విచారించారు. అచ్చెం నాయుడు న్యాయవాదులు, ఆయనకు చికిత్స చేసిన వైద్యుల సమక్షంలోనే […]
మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతోందంటూ లోకేష్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఈఎస్ఐలో అవినీతి జరిగితే […]
ఈఎస్ఐ స్కాం ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన స్వగ్రామంలో ఏసీబీ అరెస్ట్ చేసినా.. మొలలకు ఆపరేషన్ జరగడంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించినా.. ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అచ్చెం నాయుడు కోలుకున్నారు. ఏసీబీ విజ్ఞప్తి మేరకు ఆయన్ను మూడు రోజులు కస్టడీకి ఇస్తూ ఏబీసీ కోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో నిన్న అర్థరాత్రి గుంటూరు జీజీహెచ్‌లో హైడ్రామా నడిచింది. […]