iDreamPost
iDreamPost
మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభ్యర్ధనను న్యాయస్ధానం కొట్టేసింది. మెరుగైన వైద్యం కోసం తనను సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో చేర్చేందుకు అనుమతించాలంటూ అచ్చెన్న కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆయన పిటీషన్ను పరిశీలించిన కోర్టు అచ్చెన్నను సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కు తరలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం మాజీమంత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇఎస్ఐ కుంభకోణంలో కీలక పాత్రదారుడన్న అభియోగాలతో ఏసిబి అధికారులు అచ్చెన్నను 15 రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అరెస్టు సమయానికే అచ్చెన్న పైల్స్ సమస్యకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నను శ్రీకాకుళం నుండి విజయవాడకు తీసుకురావటంతో కాస్త ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో వెంటనే అచ్చెన్నను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేయించాల్సొచ్చింది.
దాంతో గుంటూరు జనరల్ ఆసుపత్రిలో తనకు సరైన వైద్యం అందటం లేదంటూ మాజీమంత్రి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కు తరలించాలంటూ కోర్టులో పిటీషన్ వేశాడు. చివరకు విచారణ సందర్భంగా గుంటూరు హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన నివేదికను కూడా కోర్టు పరిశీలించింది. మెరుగైన వైద్యం కోసమే అచ్చెన్నను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
వైద్యం విషయంలో గుంటూరు ఆసుపత్రిలోనే మాజీమంత్రికి మంచి వైద్యం అందుతోందని కూడా కోర్టు నిర్ణయానికి వచ్చింది. అందుకనే అచ్చెన్న పిటీషన్ను కొట్టేసింది. పనిలో పనిగా అచ్చెన్నను మూడు రోజుల ఏసిబి కస్టడికి ఇస్తున్నట్లు కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. అచ్చెన్నతో పాటు ఇఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ తో పాటు మరికొందరిని కూడా ఏసిబి కస్టడీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.