కావాలని కాకపోయినా అనుకోకుండా అన్నది ఏదైనా సరే సోషల్ మీడియా పుణ్యమాని వైరల్ టాపిక్ గా మారిపోతోంది. విడుదలకు ముందు వారసుడు నిర్మాత దిల్ రాజు విజయ్ ని తమిళనాడు నెంబర్ వన్ స్టార్ అనడం ఎంత రచ్చ చేసిందో గుర్తుందిగా. అజిత్ ఫ్యాన్స్ ఆయన్ను ట్విట్టర్ లో గట్టిగానే తగులుకున్నారు. ఇటీవలే వంశీ పైడిపల్లి ఒక ఆరవ ఛానల్ ఇంటర్వ్యూలో సినిమా టీవీ సీరియల్ లా ఉందన్న కామెంట్స్ కు ఘాటుగా స్పందించడం మరోసారి టార్గెట్ […]
నితిన్ దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి మెల్లగా బడ్జెట్ లు పెంచుకుంటూ ఇప్పుడు అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు ప్రస్తుతం తన బ్యానర్ ని భారీ ఎత్తున విస్తరించే పనిలో ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్టు ఆల్రెడీ రెండు వందల కోట్ల భారీ వ్యయంతో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ ఏడాది విడుదలకే ప్లాన్ చేస్తున్నారు కానీ ఒకవేళ సాధ్యం కాకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఉంటుంది. తాజాగా మరో […]
వారసుడు విడుదలకు ముందు హీరో విజయ్ సార్ ఇంటర్వ్యూ లేదా ఈవెంట్ ఏదో ఒకటి ఇస్తారని హామీ ఇచ్చిన దిల్ రాజు ఆఖరికి ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. సినిమా రిలీజైపోయింది. రొటీన్ ఫ్యామిలీ కంటెంట్ తో తెలుగు జనాన్ని పెద్దగా మెప్పించలేదు కానీ పండగ సీజన్ పుణ్యమాని మొదటి రెండు రోజుల వీకెండ్ ని మంచి కలెక్షన్లతోనే ముగించింది. సంక్రాంతి హడావిడి ముగిశాక ఇంకేం ఆశించినా అత్యాశే. దిల్ రాజు నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ తో […]
సంక్రాంతి పండక్కు డబ్బింగ్ మూవీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వివాదం మీద ఎక్కువ చర్చలో I ఉన్న వారసుడు ఎట్టకేలకు తమిళ వెర్షన్ కన్నా మూడు రోజులు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. విజయ్ ఇమేజ్ పరిమితంగానే ఉన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు దీనికి భారీ రిలీజ్ దక్కేలా స్క్రీన్లను ప్లాన్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కంటెంట్ మీద బలమైన నమ్మకం చూపిస్తున్న ఎస్విసి టీమ్ దానికి తగ్గ ఫలితం అందుకుంటుందా లేదానే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు […]
నెల రోజులకు పైగానే థియేటర్ల ఇష్యూలో కేంద్ర బిందువుగా నిలిచిన వారసుడు ఎట్టకేలకు విడుదల తేదీ మార్చుకుంది. జనవరి 14కి పోస్ట్ పోన్ చేస్తూ నిర్మాత దిల్ రాజు, నటుడు శ్రీకాంత్ కలిసి హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు మంచి రిలీజ్ దక్కడం కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఆ రెండు ట్రైలర్లకు వచ్చిన భీభత్సమైన రెస్పాన్స్ చూశాక వారసుడు లాంటి డబ్బింగ్ […]
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కావాల్సిన వారసుడుకి చివరి నిమిషం చిక్కులు వచ్చాయని ఫిలిం నగర్ టాక్. తమిళ వెర్షన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం పలు కారణాల వల్ల ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యంగా రిలీజవుతుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. దానికి తగ్గట్టే ఇవాళ దిన పత్రికల్లో ఇచ్చిన థియేటర్ లిస్టు యాడ్ లో డేట్ ఇవ్వకపోవడంతో ఇది నిజమనేందుకు మరింత బలం చేకూరింది. యుఎస్ […]
నిన్న విడుదలైన వారసుడు ట్రైలర్ సోషల్ మీడియా మీమర్స్ కి పెద్ద పనే అప్పజెప్పింది. తమిళనాట భారీ హైప్ తో రిలీజవుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా మీద తెలుగులో పెద్దగా అంచనాలు లేవు కానీ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల తమ హీరోల సినిమాలకు థియేటర్ల తగ్గిపోతున్నాయని చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆల్రెడీ ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి కన్నూ దీని మీదే ఉంది. […]
అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా కావడంతో వీర సింహా రెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ క్రేజ్ పీక్స్ లో ఉందని, దాంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దిల్ రాజు దెబ్బకి ఈ మూవీ ఓపెనింగ్స్ కి భారీ కోత […]
ఇప్పటికే సంక్రాంతి పందెం మహా వేడెక్కగా ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు వాతావరణాన్నిమరింత టెన్షన్ గా మారుస్తున్నాయి. థియేటర్ల విషయంలో ఒక ఎగ్జి బిటర్ గా నిర్మాతగా తన స్టాండ్ లో ఎలాంటి మార్పు ఉండదంటున్న దిల్ రాజు ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను ఎదురుకుంటున్న రిస్కులతో పాటు చాలా విషయాలే పంచుకున్నారు. వారసుడు తమిళ చిత్రమే అయినప్పటికీ ఒక తెలుగు నిర్మాత టాలీవుడ్ దర్శకుడు నిర్మించింది కాబట్టి దాన్ని మిగిలిన డబ్బింగ్ సినిమాలతో పోల్చలేమని తేల్చి […]
వారసుడు విడుదల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులోనూ నిర్మాత దిల్ రాజుకు పెద్ద సవాల్ గా మారింది. ఇక్కడేమో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు థియేటర్లు తగ్గించేసి డబ్బింగ్ సినిమాలు వేసుకుంటున్నారనే వివాదం నలుగుతోంది. ఇది చాలదన్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూ విజయ్ నెంబర్ వన్, అతనికి ఎక్కువ స్క్రీన్లు రావాలని దిల్ రాజు చేసిన కామెంట్లు అజిత్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. తునివుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ కి కలుసుకుని అదనంగా ఇమ్మని […]