iDreamPost
android-app
ios-app

‘వీర సింహా రెడ్డి’కి భారీ ఓపెనింగ్స్ కష్టమే!

  • Published Dec 31, 2022 | 11:48 AM Updated Updated Dec 31, 2022 | 11:48 AM
‘వీర సింహా రెడ్డి’కి భారీ ఓపెనింగ్స్ కష్టమే!

అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా కావడంతో వీర సింహా రెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ క్రేజ్ పీక్స్ లో ఉందని, దాంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దిల్ రాజు దెబ్బకి ఈ మూవీ ఓపెనింగ్స్ కి భారీ కోత పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా ఉండనుంది. వీర సింహా రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య కూడా విడుదల కానుంది. అలాగే వారసుడు(వారిసు), తెగింపు(తునివు), కళ్యాణం కమనీయం సినిమాలు కూడా సంక్రాంతికే వస్తున్నాయి. వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. నైజాంతో పాటు కొన్ని ఏరియాల్లో సొంతంగానే విడుదల చేస్తోంది. ఇక వారసుడు చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాగా.. దానితో పాటు తెగింపు, కళ్యాణం కమనీయం చిత్రాలను కూడా ఆయనే విడుదల చేస్తున్నాడు. అదే ఇప్పుడు వీర సింహా రెడ్డి ఓపెనింగ్స్ పాలిట శాపంగా మారే అవకాశముంది.

జనవరి 12న వీర సింహా రెడ్డి విడుదల కానుండగా.. అదే రోజున వారసుడు, తెగింపు చిత్రాలు వస్తున్నాయి. అయితే థియేటర్ల విషయంలో దిల్ రాజు ఆధిపత్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నైజాం, ఉత్తరాంధ్రలో మెజారిటీ థియేటర్లు ఆయన గుప్పిట్లో ఉంటాయి. జనవరి 12న వారసుడు, తెగింపు చిత్రాలు ఎక్కువ థియేటర్లను ఆక్రమిస్తాయి. పైగా వారసుడు సొంత సినిమా కాబట్టి దానిని భారీస్థాయిలో విడుదల చేయనున్నాడు. అలా కావల్సినన్ని థియేటర్లు దొరక్క వీర సింహా రెడ్డి ఫస్ట్ డే వసూళ్లకు భారీ గండి పడే ఛాన్స్ ఉంది. ఇది చాలదు అన్నట్లుగా మరుసటి రోజే జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. ఆ లెక్కన రెండో రోజే సగానికి పైగా థియేటర్లను వీర సింహా రెడ్డి త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ లోపు వారసుడు, తెగింపు సినిమాలకు కేటాయించిన థియేటర్లలో కొన్ని అయినా ఫ్రీ అవుతాయేమో అనుకుంటే.. జనవరి 14న కళ్యాణం కమనీయం చిత్రాన్ని రంగంలోకి దింపనున్నాడు దిల్ రాజు. ఇది యూవీ నిర్మాణం కావడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో విడుదలవుతుంది అనడంలో సందేహం లేదు. ఇలా ఓ వైపు థియేటర్ల కొరత, మరోవైపు ఇతర చిత్రాలతో పోటీ కారణంగా వీర సింహా రెడ్డి ఓపెనింగ్స్ వీక్ అయ్యే అవకాశముంది. మరి ఈ ప్రతికూలతలను తట్టుకుని కూడా నిలబడి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş