iDreamPost
android-app
ios-app

విజయ్ మంకుపట్టే గెలిచింది

  • Published Jan 16, 2023 | 8:20 PM Updated Updated Dec 13, 2023 | 5:52 PM

రొటీన్ ఫ్యామిలీ కంటెంట్ తో తెలుగు జనాన్ని పెద్దగా మెప్పించలేదు కానీ పండగ సీజన్ పుణ్యమాని మొదటి రెండు రోజుల వీకెండ్ ని మంచి కలెక్షన్లతోనే ముగించింది. సంక్రాంతి హడావిడి ముగిశాక ఇంకేం ఆశించినా అత్యాశే.

రొటీన్ ఫ్యామిలీ కంటెంట్ తో తెలుగు జనాన్ని పెద్దగా మెప్పించలేదు కానీ పండగ సీజన్ పుణ్యమాని మొదటి రెండు రోజుల వీకెండ్ ని మంచి కలెక్షన్లతోనే ముగించింది. సంక్రాంతి హడావిడి ముగిశాక ఇంకేం ఆశించినా అత్యాశే.

విజయ్ మంకుపట్టే గెలిచింది

వారసుడు విడుదలకు ముందు హీరో విజయ్ సార్ ఇంటర్వ్యూ లేదా ఈవెంట్ ఏదో ఒకటి ఇస్తారని హామీ ఇచ్చిన దిల్ రాజు ఆఖరికి ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. సినిమా రిలీజైపోయింది. రొటీన్ ఫ్యామిలీ కంటెంట్ తో తెలుగు జనాన్ని పెద్దగా మెప్పించలేదు కానీ పండగ సీజన్ పుణ్యమాని మొదటి రెండు రోజుల వీకెండ్ ని మంచి కలెక్షన్లతోనే ముగించింది. సంక్రాంతి హడావిడి ముగిశాక ఇంకేం ఆశించినా అత్యాశే. దిల్ రాజు నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ తో పాటు రెగ్యులర్ గా కనిపించే యాంకర్ తో జయసుధ శ్రీకాంత్ జై తదితరులతో ఓ ముఖాముఖీ చేయడం తప్ప ఇంకేమి జరగలేదు. ఇకపై ఇంకేదో చేసే ఆసక్తి కూడా ఎస్విసి బృందంలో లేదు

సో విజయ్ హైదరాబాద్ కు వచ్చి కనీసం మొహం చూపిస్తారేమో అనుకున్న అంచనా లెక్క తప్పింది. రాకూడదనే తన మంకుపట్టే గెలిచింది. నిజానికి వారసుడుకి వచ్చిన టాక్ కి దాన్ని నిలబెట్టడం కోసమైనా కొంత పబ్లిసిటీ వేగం పెంచాలి. క్యారెక్టర్ ఆర్టిస్టులతో అది జరగదు, కనీసం రష్మిక మందన్నతో చేద్దామంటే ఆమె అందుబాటులో లేదు. అలాంటప్పుడు ఫేస్ అఫ్ ది మూవీ హీరో తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇదే తరహా ధోరణి చూపించే నయనతార తన పద్ధతిని పక్కనపెట్టి ఇటీవలే కనెక్ట్ కోసం సుమకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. భర్త నిర్మాతే అయినప్పటికీ ఈ మాత్రం చొరవ చూపిందిగా. మన హీరోల గురించి నాలుగు ముక్కలు చక్కగా చెప్పింది కూడా

ఈ లెక్కన దిల్ రాజు పలుకుబడి వంశీ పైడిపల్లి బ్రాండ్ ఇవేవి వారసుడు కోసం విజయ్ ని తీసుకురాలేకపోయాయి. డబ్బింగ్ వెర్షన్లతో తనకు సంబంధం లేదనే రీతిలో వ్యవహరించే ఆలోచన విజయ్ లో మారలేదని అర్థమైపోయింది. ఒక తెలుగు నిర్మాత దర్శకుడు కలిసి తనతో ఇంత పెద్ద బడ్జెట్ మూవీ తీసినప్పుడు ఆ మాత్రం సహకారం ఆశించడం తప్పేమీ కాదు. షారుఖ్ ఖాన్ పఠాన్ ట్రైలర్ ని ప్రత్యేకంగా ట్విట్టర్ హ్యాండిల్ లో చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన విజయ్ వరిసు తెలుగు వెర్షన్ కు సంబంధించి ఏ ఒక్క ట్వీట్ వేయకపోవడంతోనే అర్థం చేసుకోవాలి తన ప్రాధాన్యతలు ఏ క్రమంలో ఉన్నాయో. ఒకవేళ ఎవరైనా కోలీవుడ్ అగ్ర నిర్మాత తెలుగులో స్టార్ హీరోతో సినిమా తీస్తే మనవాళ్ళు ఇచ్చే సహకారం ముందు ఎవరైనా దిగదుడుపే