iDreamPost
android-app
ios-app

దిల్ రాజు 3 ప్యాన్ ఇండియా సినిమాలు

  • Published Jan 17, 2023 | 7:24 PM Updated Updated Jan 17, 2023 | 7:24 PM
  • Published Jan 17, 2023 | 7:24 PMUpdated Jan 17, 2023 | 7:24 PM
దిల్ రాజు 3 ప్యాన్ ఇండియా సినిమాలు

నితిన్ దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి మెల్లగా బడ్జెట్ లు పెంచుకుంటూ ఇప్పుడు అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు ప్రస్తుతం తన బ్యానర్ ని భారీ ఎత్తున విస్తరించే పనిలో ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్టు ఆల్రెడీ రెండు వందల కోట్ల భారీ వ్యయంతో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ ఏడాది విడుదలకే ప్లాన్ చేస్తున్నారు కానీ ఒకవేళ సాధ్యం కాకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఉంటుంది. తాజాగా మరో మూడు క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాలను రాజుగారు రెడీ చేస్తున్నారు. అందులో మొదటిది ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో. వీళ్ళ కలయికలో ఆల్రెడీ సలార్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

దానికి సంబంధించిన లీకులు చాలా పాజిటివ్ గా ఉండటంతో పాటు కెజిఎఫ్ ని మించి అవుట్ ఫుట్ వస్తోందన్న రిపోర్ట్స్ తో మరోసారి చేతులు కలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. అయితే యాక్షన్ ఎంటర్ టైనర్ కాకుండా సోషియో ఫాంటసీ తరహాలో డిఫరెంట్ కాన్సెప్ట్ ని సిద్ధం చేశారట. రావణం టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం వెంకటేష్ తో ఓ సినిమా కమిటైన శైలేష్ కొలను నెక్స్ట్ దిల్ రాజుకో భారీ యాక్షన్ సబ్జెక్టుతో ఓకే చేయించుకున్నట్టు తెలిసింది. విశ్వంభర అనే వర్కింగ్ టైటిల్ తో పనులు మొదలుపెట్టినట్టు తెలిసింది. జటాయు అనే మరో ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో ఇంద్రగంటి మోహనకృష్ణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందట

మొత్తానికి ఈ మూడు ప్యాన్ ఇండియా ప్లాన్స్ తో దిల్ రాజు పెద్ద స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ వరిసుతో కోలీవుడ్ ఎంట్రీ విజయవంతంగా జరిగిపోయింది. తెలుగులో పెద్దగా ఆడినా ఆడకపోయినా అక్కడ సక్సెస్ అయ్యింది కాబట్టి మున్ముందు కొనసాగే అవకాశాలు పెరిగాయి. హిందీలో జెర్సీ, హిట్ రీమేకులతో ఎంట్రీ ఇచ్చారు కానీ ఆ రెండు డిజాస్టర్ కావడంతో సరైన కాంబో కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు. హోంబాలే, మైత్రి లాంటి అయిదారేళ్ళ అనుభవమున్న చిన్న బ్యానర్లు రెండు మూడు వేల కోట్లతో ప్లానింగ్ చేసుకుంటే యాభై సినిమాల నిర్మాణ అనుభవమున్న దిల్ రాజు ఇంకా వేగంగా పావులు కదపాలనుకోవడం రైటే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet