iDreamPost
android-app
ios-app

థాంక్ యు ప్రీమియర్లు ఈ రోజు రాత్రే

  • Published Jul 21, 2022 | 12:49 PM Updated Updated Jul 21, 2022 | 12:49 PM
థాంక్ యు ప్రీమియర్లు ఈ రోజు రాత్రే

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్ యు ప్రీమియర్ షోలు ఇవాళ రాత్రి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. విచిత్రంగా హైదరాబాద్ లో ఇంకా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాల్లో సరిగ్గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ చేయబోతున్నారు. ఇలాంటి సాఫ్ట్ జానర్ మూవీకి ఇలా చేయడం ఇదే మొదటిసారి. గతంలో అర్జున్ రెడ్డికి ఇదే తరహాలో ఆటలు వేశారు కానీ దాని కంటెంట్ అండ్ కాన్ఫిడెన్స్ వేరు. యూత్ లో రిలీజ్ కు ముందే పిచ్చ క్రేజ్ వచ్చింది. కానీ థాంక్ యు విషయంలో అలాంటిది లేదు. మౌత్ టాక్ నే నమ్ముకుని రంగంలోకి దిగుతోంది

రాత్రి షోలకు సంబంధించి టికెట్ల అమ్మకాలు కూడా మొదలైపోయాయి. సో రేపు తెల్లవారకుండానే ఓవర్ సీస్ షోల కంటే ముందే ఫ్యాన్స్ థాంక్ యుని చూసేయొచ్చన్న మాట. నిజానికి రిలీజ్ రోజు ఉదయం ప్రసాద్ ఐమ్యాక్స్ లో 8.45 షోకే ఎలాంటి టాక్ వస్తుందోనని నిర్మాతలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటిది థియేటర్లకు జనం తగ్గిపోతున్న ట్రెండ్ లో థాంక్ యు ఇలా రివర్స్ లో ఆలోచించడం విశేషం. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ జర్నీలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా మాళవిక నాయర్ మరో కీలక పాత్ర చేసింది. ఉయ్యాలా జంపాల ఫేమ్ అవికా గోర్ చైతుకి సిస్టర్ తరహా క్యారెక్టర్ చేయడం విశేషం.

టికెట్ రేట్లకు సంబంధించిన వ్యవహారాలు నలుగుతుండగానే థాంక్ యుకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. విక్రమ్, మేజర్ తర్వాత బాక్సాఫీస్ వద్ద జోష్ ఇచ్చే హిట్ మూవీ ఏదీ రాలేదు. పక్కా కమర్షియల్, ది వారియర్ తీవ్రంగా నిరాశపరచడంతో సినిమా హాళ్లు జనం లేక వెలవెలబోతున్నాయి. పట్టుమని ఇరవై మంది లేకుండా షోలు నడిపిస్తున్న థియేటర్లు బిసి సెంటర్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దిల్ రాజు ప్రొడక్షన్, పెద్ద బడ్జెట్, హెవీ క్యాస్టింగ్ తో సోలోగా బరిలో దిగుతున్న థాంక్ యుకి అనసూయ దర్జా కాంపిటీషన్ ఇస్తోంది కానీ దానికి పెద్దగా బజ్ లేదు కాబట్టి టెన్షన్ లేదు. సో బంగార్రాజు తర్వాత చైతు మరో హిట్టు కొడతాడా చూద్దాం