iDreamPost
android-app
ios-app

అఖిల్ కోసం పవన్ కళ్యాణ్ టైటిల్

  • Published Jul 12, 2022 | 12:06 PM Updated Updated Jul 12, 2022 | 12:06 PM
  • Published Jul 12, 2022 | 12:06 PMUpdated Jul 12, 2022 | 12:06 PM
అఖిల్ కోసం పవన్ కళ్యాణ్ టైటిల్

ఈ మధ్య పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ టైటిల్స్ యంగ్ హీరోలు భలేగా వాడేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఖుషి తీసేసుకున్నారు. సమంతా హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ షూటింగ్ కీలక దశలో ఉంది. డిసెంబర్ విడుదలకు ఏరాట్లు జరుగుతున్నాయి. క్లాసిక్ పేరుని ఇలా వాడుకోవడం పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫీలైనా ప్రయోజనం లేదు.

ఇప్పుడు అఖిల్ కూడా ఇదే దారి పట్టబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. వకీల్ సాబ్ తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ కు మరో ప్రాజెక్ట్ ఇస్తానని దిల్ రాజు అప్పట్లోనే మాటిచ్చారు. అల్లు అర్జున్ ఐకాన్ తో అది నెరవేరుతుందనుకుంటే అది కాస్తా ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. దానికి బదులు అఖిల్ తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు తమ్ముడు టైటిల్ ఆల్మోస్ట్ లాక్ చేసినట్టు టాక్.

బాక్సింగ్ ఛాంపియన్ గా పవన్ నటించిన తమ్ముడు అప్పట్లో పెద్ద హిట్టు. మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు అద్భుతమైన పాటలు, అన్నిటికంటే బెస్ట్ కామెడీ టైమింగ్ పవర్ స్టార్ ది ఇందులోనే చూడొచ్చు. కథ ప్రకారం అఖిల్ కు ఇదే సెట్ అవుతుందట. వరుణ్ తేజ్ తొలిప్రేమతో హిట్ అందుకున్నాడు. మరి రౌడీ బాయ్, అక్కినేని హీరోలకు ఈ సెంటిమెంట్ ఏమిస్తుందో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss