చిరు వ్యాపారులది గొప్ప సేవ అని సీఎం జగన్ ప్రశంసించారు. చిరు వ్యాపారుల కష్టాలను పాదయాత్రలో చూశానన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎలాంటి వడ్డీ భారం లేకుండా, లక్షల కుటుంబాలను ఆదుకున్నామని అన్నారు. హస్త కళాకారులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్నారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా, రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు, గత ఆర్నెల్లకు రూ.15.96 కోట్ల […]
గత కొన్ని రోజులుగా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా తయారుచేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఈ దావోస్ వేదికని చక్కగా వినియోగించుకున్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రంలోకి దావోస్ నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు […]
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైయస్.జగన్ దావోస్ చేరుకుంటున్నారు. స్విట్జర్లాండ్‌లోని జురెక్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన, అక్కడ నుంచి దావోస్ ప్రయాణమయ్యారు. కాసేపట్లో దావోస్ చేరుకుంటారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ సీఎంకు సాదర స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ […]
రాజకీయపార్టీల అంతిమలక్ష్యం అధికారం సాధించడం. ఇందుకోసం ఆయా పార్టీల అధినేతలు ప్రజలకు అనేక హామీలు ఇస్తూ.. ఎన్నికల నాటికి వారి మద్ధతును కూడగడుతుంటారు. ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా ఈ హామీలు ఉంటాయి. సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై కూడా పలు హామీలు ఉంటాయి. హామీలు ఇచ్చి ఓట్లు వేపించుకుని, ఆ పై అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా హామీలను అమలుచేసే నేతలు బహుఅరుదుగా ఉంటారు. ఎక్కువమంది ఇచ్చిన హామీలను మరిచిపోతుంటారు. ఎవరైనా గుర్తుచేసే ప్రయత్నం చేస్తే.. […]
‘వ్యాక్సిన్ వచ్చేదాకా కరోనాతో మనం సహజీవనం చెయ్యాలి’.. ఏడాది కిందట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది. నిజానికి ఈ కామెంట్లతో దేశంలో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు కూడా చేయని ధైర్యం ఆయన చేశారు. ప్రజలు భయపడుతారని తెలిసినా, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని తెలిసినా ఆయన తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారు. కానీ అన్ని వైపుల నుంచి జగన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోనూ హేళన చేస్తూ మాట్లాడారు. […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అటు పాలనాపరంగానూ, ఇటు రాజకీయంగానూ జగన్ నిర్ణయాలు దానికి దోహదపడుతున్నాయి. ఇప్పటికే పాలన పూర్తిగా మండల కేంద్రాల నుంచి పంచాయతీలకు చేరింది. సచివాలయాలే కేంద్రంగా అనేక వ్యవహారాలు చురుగ్గా సాగుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు కూడా జోరందుకున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు చేరేందుకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో రాజకీయంగానూ కొత్త శక్తులను ప్రోత్సహించే ప్రయత్నం సాగుతోంది. ఇప్పటికే క్యాబినెట్ కూర్పు, ఎమ్మెల్యేల ఎంపికలో జగన్ అదే […]
ఆంధ్రప్రదేశ్‌లో ఆరవ, రాయలసీమలో మూడో విమానాశ్రయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కర్నూలు నగరానికి సమీపంలోని నిర్మించిన ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. విమానాశ్రయం నిర్మాణానికి చేసిన కృషిని విమరించిన సీఎం జగన్.. ఎయిర్‌పోర్టుకు పేరును కూడా పెట్టారు. స్థానికుడు, స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఘననివాళులు అర్పిస్తూ, ఆయన గౌరవార్థం […]
విజయవాడ కృష్ణా నది తీరంలో 9 ఆలయాలను తిరిగి నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్.. ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ ఆలయాలను కృష్ణా నది పుష్కరాల సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. విజయవాడ నగరం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దాదాపు 40 ఆలయాలను నాటి సీఎం చంద్రబాబు కూల్చివేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ఆలయాలను తిరిగి నిర్మిస్తామని […]
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. బహుళార్థక ప్రాజెక్టు అయిన పోలవరం పనులు వడివడిగా సాగుతున్నాయి. దశాబ్ధాల తరబడి తెలుగు ప్రజలు కంటున్న కలలు సాకారమయ్యేలా పోలవరం పనుల్లో కీలక ఘట్టానికి గురువారం నాంధి పడింది. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా.. రాజకీయ నేతల హడావుడి కనిపించకుండానే.. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలో గేట్లను బిగించేందుకు ప్రధానమైన ఆర్మ్ గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియకు ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. సోమవారం సీఎం వైఎస్ […]