iDreamPost
android-app
ios-app

TDPకి మరో షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే!

  • Published Jan 12, 2024 | 10:29 AM Updated Updated Jan 12, 2024 | 10:29 AM

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఊహించని విధంగా వరుసగా షాకులు తగులుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఊహించని విధంగా వరుసగా షాకులు తగులుతున్నాయి.

  • Published Jan 12, 2024 | 10:29 AMUpdated Jan 12, 2024 | 10:29 AM
TDPకి మరో షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే!

ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికలకు సిద్దమవుతున్నారు. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ..మరోసారి ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ర్యాలీలు, మహాసభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత వరుసగా షాకులు తగులుతున్నాయి. ఎప్పటి నుంచో టీడీపీ లో నమ్మకంగా కొనసాగుతున్నవారంతా.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరారు. వవరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరగా, ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న తిరువూరు నుంచి మాజీ ఎమ్మెల్యే నలగట్ల స్వామిదాస్ టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. గురువారం సాయంత్రం స్వామిదాస్ ఆయన సతీమణి సుధారాణి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. సీఎం జగన్ దంపతులకు కండువ కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత మూడు దశాబ్దాలుగా నల్లగట్ల స్వామిదాస్ టీడీపీలో కొనసాగారు. 1994, 1999 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

ex mla join in ycp party

ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ.. ‘నేను టీడీపీలో 30 ఏళ్ల వరకు పనిచేశాను.. చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటారు. అవసరం లేకపోతే ఎవరినీ దగ్గరికి కూడా రానివ్వరు. ఇన్నేళ్ళు టీడీపీకి ఎంతో నమ్మకంగా పనిచేశాను.. కనీసం ఒక్కసారి కూడా ఇంట్లోకి నన్ను రానివ్వలేదు. ఆయన ఎవరితోనూ మానవత్వంతో వ్యవహరించారు. నేనూ.. నా భార్య ఒక సందర్భంలో పది రోజులు ఆయన ఇంటి ముందు ఎదురు చూసినా మమ్ముల్ని పట్టించుకోలేదు. అంతేందుకు టీడీపీ నేతలు కొంతమంది నన్ను వెన్నుపోటు పొడిచారు. ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళితులకు ఇస్తున్న ప్రాధాన్యత, సంక్షేమ పథకాలు అందించడంలో చూపుతున్న శ్రద్ద నన్ను బాగా ఆకర్షించాయి.. అందుకే వైసీపీలో చేరాను. రాష్ట్రాభివృద్ది కోసం సీఎం జగన్ ఏం చెబితే అది చేయడానికి సిద్దంగా ఉన్నా’ అని అన్నారు.