P Venkatesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల బృందం త్వరలోనే బకాయిలను విడుదల చేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల బృందం త్వరలోనే బకాయిలను విడుదల చేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. కొంత కాలం నుంచి పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రుల బృందం వారితో భేటీ అయ్యింది. ఐఆర్, పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్‌లు, పదవీ విమరణ బకాయిలపై మంత్రుల బృందం చర్చించింది. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం వారికి తీపికబురును అందించింది. ఈ విషయంపై మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉద్యోగుల సమస్యలపై చర్చించామని త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. త్వరలోనే రూ. 5600 కోట్ల బకాయిలను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇక నిధుల విడుదల, ఉద్యోగుల పెండింగ్ అంశాలను పరిష్కరించాలని సీఎస్, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి బొత్స తెలిపారు. వీలైనంత త్వరగా పీఆర్‌సీని ప్రకటించాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స గుర్తు చేశారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూలం ధోరణినే అవలంబిస్తోందని, వారు లేవనెత్తిన అన్ని డిమాండ్లను త్వరలోనే ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. విశాఖ ఎమ్మార్వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పటికే ప్రకటించామని ఈ సందర్బంగా మంత్రి బొత్స వెల్లడించారు.