P Krishna
Good News for Farmers: ఏపీ సర్కార్ అన్నదాతల కోసం ఇప్పి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మరో గుడ్ న్యూస్ అందించి ఏపీ సర్కార్.
Good News for Farmers: ఏపీ సర్కార్ అన్నదాతల కోసం ఇప్పి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మరో గుడ్ న్యూస్ అందించి ఏపీ సర్కార్.
P Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పతకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, రైతు, మహిళల కోసం వివిధ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులను, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ సర్కార్ వ్యవసాయంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చింది. తాజాగా ఏపీ సర్కార్ రైతుల కు మరో శుభవార్త అందించింది. వివరాల్లోకి వెళితే..
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల జీవనశైలి లో మార్పులు తీసుకు వచ్చే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించామని పలు సందర్భాల్లో సీఎం జగన్ అన్నారు. తాజాగా అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీ రైతులకు సబ్సిడీ పై జగన్ సర్కార్ విత్తనాలు అందించనుంది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 20 వ తేదీ నుంచి సబ్సిడీ పై విత్తనాలను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. 16.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై 50 శాతం, వేరు శనిగపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. దీని కోసం 450 కోట్లు ఖర్చు చేస్తుంది ఏపీ సర్కార్. 195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చి రొట్ట, చిరుదాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరు శనిగపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. ఎన్ఎఫ్‌ఎస్‌ఎం పరిధిలోని జిల్లాల్లో వరి విత్తనాలు క్వింటాల్ వెయ్యి రూపాయలు, మిషన్ పరిధిలోని లేని జిల్లాల్లో 500 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.