iDreamPost
android-app
ios-app

అధికారంలోకి రాగానే ‘వాలంటీర్‌ ’ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్‌

  • Published Apr 04, 2024 | 8:19 PM Updated Updated Apr 04, 2024 | 8:19 PM

CM Jagan Comments: ఆంధ్రప్రదేవ్ లో మరో ఐదు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు.

CM Jagan Comments: ఆంధ్రప్రదేవ్ లో మరో ఐదు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు.

అధికారంలోకి రాగానే ‘వాలంటీర్‌ ’ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్‌

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయాలు వాడీ వేడిగా తయారవుతున్నాయి. ఎవరి గెలుపు ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీని ఎలాగైనా ఓడించాలని ప్రతి పక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే.ఈ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేపట్టింది. ఇక తాము చేసిన అభివృద్ది ప్రజలు గమనిస్తున్నారని.. ఈ ఏన్నికల్లో ఒంటరిగానే పోరాడుతామని అధికార పార్టీ ముందుకు సాగుతుంది. అధికారంలోకి వచ్చిన తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకువెళ్తుంది వైసీపీ. ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారం కోసం జగన్ ని ఎలాగైనా ఓడించాలని కూటమి.. పేదల ప్రజల అభ్యున్నతికి పట్టం కట్టాలంటే మరోసారి ఛాన్స్ ఇవ్వమని అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం బస్సు’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారు.. ఎక్కడ చూసినా జన సంద్రం కనిపిస్తుంది. తాజాగా నాయుడిపేటలో ప్రజా ప్రభంజనం ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు.. పేద ప్రజల అభ్యున్నతి, భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు. మీ ఓటు మీ భవిష్యత్ తరలాలపై ఆధారపడి ఉంటుంది.. ఏపీ అభివృద్ది చేసే వారికా? ఏపీని దోచుకునే వారికా? నిర్ణయం మీదే అని అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి గ్రామంలో ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చూస్తున్నామని అన్నారు.  ఎన్నికల సమయంలో చంద్రబాబు కుట్ర బయట పెట్టుకున్నారు. వలంటీర్ల వ్యవస్థపై లేనిపోని ఆరోపణలు చేసి తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీ అడ్డుకున్నారనినిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రతి నెల 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4 వరకు ఓపిక పట్టండి.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపై చేసి ప్రతి ఇంటికి మళ్లీ సేవలందించే కార్యక్రమాన్ని చేపడుతాం అని సీఎం జగన్ ప్రకటించారు.