iDreamPost
android-app
ios-app

నేత కార్మికులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

  • Published Feb 23, 2024 | 11:02 AM Updated Updated Feb 23, 2024 | 11:02 AM

Good News for Weavers: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వచ్చారు.. తాజాగా పవర్ లూమ్ చేనేతలకు ఓ గొప్ప శుభవార్త చెప్పారు.. అదేంటంటే..

Good News for Weavers: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వచ్చారు.. తాజాగా పవర్ లూమ్ చేనేతలకు ఓ గొప్ప శుభవార్త చెప్పారు.. అదేంటంటే..

  • Published Feb 23, 2024 | 11:02 AMUpdated Feb 23, 2024 | 11:02 AM
నేత కార్మికులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాల పథకాలు తీసుకువచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా సామాన్య ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేత కార్మికుల ఏపీ ప్రభుత్వం ఓ గొప్ప శుభవార్త చెప్పింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటనుకుంటున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీ సర్కార్ నేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పవర్ లూమ్ లకు విద్యుత్ సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రకటించారు. యూనిట్ కరెంట్ పై 94 పైసలు రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి ఆరు పైసలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పవర్ లూమ్ చేనేత కార్మికుల గొప్ప ఉపశమనం కలిగిందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పవర్ లూమ్స్ మగ్గాల ద్వారా చీరలు నేసే నేత కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పవర్ లూమ్స్ ద్వారా చీరలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా హిందూపురం, ధర్మవరం ప్రాంతాల్లో ఎక్కువగా పవర్ లూమ్స్ మగ్గాలు ఉన్నట్లు సమాచారం.

హ్యాండ్ లూమ్స్ వారికి మాత్రమే ప్రభుత్వ రాయితీ కల్పిస్తుందని.. తమను కూడా ఆదుకోవాలని పలుమార్లు పవర్ లూమ్స్ కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. పవర్ లూమ్ యంత్రాలకు విద్యుత్ చార్జీలు ఎక్కువగా వస్తున్నాయని, సబ్సిడీ కల్పించి తమను ఆదుకోవాలని పవర్ లూమ్ కార్మికులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే యూనిట్ కు 94 పైసలు రాయితీ కల్పిస్తు ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.