iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: YSRCP ఆరో జాబితా రిలీజ్.. ఎవరెవరు ఎక్కడంటే?

  • Published Feb 02, 2024 | 9:29 PM Updated Updated Feb 02, 2024 | 9:29 PM

YSRCP 6th List: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బరిలోకి దిగే నాయకుల విషయంలో వైఎస్సాఆర్ సీపీ పలు మార్పులు చేర్పులు చేస్తుంది.. ఈ క్రమంలో వారి జాబితా విడుదల చేస్తున్నారు.

YSRCP 6th List: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బరిలోకి దిగే నాయకుల విషయంలో వైఎస్సాఆర్ సీపీ పలు మార్పులు చేర్పులు చేస్తుంది.. ఈ క్రమంలో వారి జాబితా విడుదల చేస్తున్నారు.

బ్రేకింగ్: YSRCP ఆరో జాబితా రిలీజ్.. ఎవరెవరు ఎక్కడంటే?

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మిగతా పార్టీలతో పోలిస్తే.. అధికార వైఎస్ఆర్సీపీ ఫుల్ స్పీడ్ తో దూసుకువెళ్తుంది. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలబడతామని ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గెలుపు గుర్రాలకే ఈసారి సీట్లు కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలక ఇంఛార్జులను మారుస్తూ ఐదు జాబితాలు విడుదల చేశారు. తాజాగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇంఛార్జులకు సంబంధించిన ఆరవ జాబితా రిలీజ్ చేశారు. ఇటీవల ఐదో జాబితా లో కొందరు నేతలకు అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా ఆరో జాబితాలో ఉన్న ఇంఛార్జుల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆరవ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజల్లో నమ్మకం ఉన్న నేతలపై కసరత్తు చేసి మరీ అభ్యర్థుల పేర్లను విడతల వారీగా ప్రకటించుకుంటూ ముందుకు సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు వైసీపీ అధిష్టానం కొంతకాలంగా వ్యూహ రచన చేస్తుంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమిస్తూ వస్తుంది. ఇప్పటికే 5 జాబితాలు రిలీజ్ చేసింది. మొత్తం 61 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే, 14 ఎంపీ స్థానాలకు ఇంచార్జీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. పాత వారిని కాదని కొత్తవారికి ఆవకాశం కల్పించారు.

ఆరో జాబితా ఇంచార్జీల పేర్లు :

  • రాజమండ్రి (ఎంపీ)-గూడూరి శ్రీనివాస్
  • నరసాపురం (ఎంపీ)- గూడూరి ఉమాబాల
  • గుంటూరు (ఎంపీ)-ఉమ్మారెడ్డి రమణ
  • చిత్తూరు (ఎంపీ)- రెడ్డప్ప
  • గిద్దలూరు ఎమ్మెల్యే-నాగార్జున రెడ్డి
  • నెల్లూరు సిటీ-ఎండీ ఖలీల్
  • జీడీ నెల్లూరు – కే నారాయణ స్వామి
  • ఎమ్మిగనూరు-బుట్టా రేణుక
  • మైలవరం-తిరుపతిరావు
  • మార్కాపురం- రాంబాబు