iDreamPost
android-app
ios-app

APలో వారందరికి శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బులు జమ!

  • Published May 18, 2024 | 1:01 PM Updated Updated May 19, 2024 | 11:23 AM

DBT Schemes Funds Released: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గొప్ప శుభవార్త అందించింది. రాష్ట్రంలో డీబీటీ పథకాల నిధులు అమలు ప్రారంభం అయ్యింది.. వివిధ పథకాలకు డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

DBT Schemes Funds Released: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గొప్ప శుభవార్త అందించింది. రాష్ట్రంలో డీబీటీ పథకాల నిధులు అమలు ప్రారంభం అయ్యింది.. వివిధ పథకాలకు డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

APలో వారందరికి శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బులు జమ!

ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చుతూ వచ్చారు. ముఖ్యంగా విద్యా, వైద్య, మహిళా, రైతు సంక్షేమాలకు సంబంధించి ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకుచ్చారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి,వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్ళు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల నేపథ్యంలోకోడ్ అమల్లో ఉన్న కారణంగా పథకాల అమలుకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో పలు పథకాల లబ్దిదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ పథకాలకు నిధులు విడుదల మొదలైంది. బుధవారం ఒక్కరోజూ ఆసరా పథకానికి రూ.1480, జగనన్న విద్యా దీవెన పథకానికి సంపూర్ణ ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద రూ.502 కోట్లు రిలీజ్ చేశారు. మిగిలిన పథకాలకు డబ్బులు విడుదల చేస్తామని తెలిపారు. అన్ని పథకాలకు రెండు మూడు రోజుల్లో నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఎన్నికల ముందు డీబీటీ పథకాల నిధుల అమలు విషయం తీవ్ర ఉత్కంఠ రేపింది. పథకాలకు సంబంధించిన డబ్బు విడుదలకు అనుమతి ఇవ్వాలని పోలింగ్ కు రెండు, మూడు రోజుల ముందు ఎన్నికలకల సంఘాన్ని కోరింది ప్రభుత్వం.

పోలింగ్ కి ముందు డబ్బులు రిలీజ్ చేయడం సరైన పద్దతి కాదని తేల్చి చెప్పింది ఎన్నికల సంఘం. జూన్ 6 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది.. ఆ తర్వాత నిధులు విడుదల చేయవొచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే లబ్దిదారులు ఏపీ హై కోర్టు ను ఆశ్రయించారు. హైకోర్టు మరోసారి ఈసీని కలిసి వినతి ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసినా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మరోసారి హై కోర్టులో మరోసారి విచారణ జరగ్గా.. నిధులు విడుదల చేసేందుకు ఒక్కరోజు అవకాశం ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఈసీని మూడోసారి పథకాల డబ్బులు రిలీజ్ చేసేందుక అనుమతి కోరినా మళ్లీ తిరస్కరించారు. మొత్తానికి  పోలింగ్ ముగిసింది.. అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.