iDreamPost
android-app
ios-app

మళ్లీ జగనే సీఎం.. తేల్చేసిన కేటీఆర్

  • Published Apr 27, 2024 | 9:36 PM Updated Updated Apr 27, 2024 | 9:49 PM

KTR Comments: తెలుగు రాష్ట్రాలో ఎన్నికల సమరం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఈ ఎన్నికలను ఇరు రాష్ట్రాల నేతలు కీలకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

KTR Comments: తెలుగు రాష్ట్రాలో ఎన్నికల సమరం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఈ ఎన్నికలను ఇరు రాష్ట్రాల నేతలు కీలకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మళ్లీ జగనే సీఎం.. తేల్చేసిన కేటీఆర్

దేశంలో ఇప్పుడు ఎన్నికల సందడి నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలుపు బావుట ఎవరు ఎగురవేస్తారని హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల మధ్య హూరా హూరీగా ప్రచారాలు, మాటల యుద్దం నడుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఎన్నికల సమరం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు.. అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఎవరు గెలుస్తారు అన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల అధినేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. గెలుపు లక్ష్యంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందన్నదానిపై దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన ఏపీ ఎన్నికలపై తనదైన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉందని.. తమకు ఉన్న సమాచారం మేరకు ఈ సారి ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ గెలుస్తారు అన్న నమ్మకం ఉంది అన్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో ఈసారి గెలుపు జగన్ దే అని కుండబద్దలు కొట్టారు. ఏపీలో జగన్ అమలు చేస్తున్న అభివృద్ది పథకాలు, సంక్షేమ కార్యక్రమాల లబ్ది పొందిన ప్రజలు మరోసారి ఆయనకే పట్టం కట్టాలనే నిశ్చయంతో ఉన్నట్లు పలు సర్వేల ద్వారా తమకు సమాచారం ఉందని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఏపీలో జగన్ గెలుపు బావుట ఎగుర వేస్తారని అటు తండ్రి, ఇటు కొడుకు తేల్చేసి చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.