SNP
CM Jagan, Vijayawada: ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై రాయి దాడి కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. జగన్‌పై దాడి చేసింది తానేనని ఓ యువకుడు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Jagan, Vijayawada: ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై రాయి దాడి కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. జగన్‌పై దాడి చేసింది తానేనని ఓ యువకుడు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఈ నెల 13వ తేదీన రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానంతో ఓ 10 మంది యువకులను సిట్ అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన 10 మంది యువకులపై అనుమానంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు పోలీసులు 20 టీమ్‌లుగా విడిపోయి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటివరకూ సుమారుగా 70 మందిని ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను సైబర్ ల్యాబ్స్‌కు పంపారు. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి ప్రాంతాన్ని పోలీసులు సెర్చ్ చేశారు. ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో పరిసర ప్రాంతాలను వీడియో చిత్రీకరణ చేసిన అధికారులు.. సెల్ ఫోన్ డేటాను డంప్ చేసి మరీ కేసును విచారణను వేగవంతం చేశారు. ఆ ఏరియాలోని ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలను తెప్పించి, వాటిని వడపోసే పనిలో ఉన్నారు. మరి సీఎం జగన్‌పై తానే దాడి చేశాను అని ఓ మైనర్ యువకుడు ఒప్పుకున్నాడని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.