తగ్గిందనుకున్న మహమ్మారి మళ్లీ విజృంభింస్తోంది. లక్షకు దగ్గరగా కేసులు వస్తేనే అమ్మో.. అనుకున్నాం.. ఇప్పుడు ఏకంగా రోజుకు మూడున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. విజృంభజన, ఉధృతి.. ఇలా అనేక పేర్లు అయిపోయాయి. ఇప్పుడు కరోనా సునామీ అంటున్నాం. రేపు ఏ పేరుతో కరోనా వ్యాప్తిని వర్ణించాలో తెలియని పరిస్థితి. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు..? జాగ్రత్తలు పాటించని ప్రజలా..? కరోనాను లైట్ తీసుకున్న ప్రభుత్వాలదా..? ఎన్నికల పేరుతో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించి సూపర్స్రైడర్లుగా […]
దేశంలో తానే సీనియర్ రాజకీయనాయకుడనని, తన అంత అనుభవం మరెవరికీ లేదని చెప్పుకుంటుంటారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తన గురించి తాను చెప్పుకునే మాటలకు.. వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన ఉండదని తిరుపతి ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుతో మరోమారు తేలిపోయింది. ‘‘ ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అప్రజాస్వామికంగా, అత్యంత సందేహాస్పదమైన పోలింగ్ జరిగింది. దొంగ ఓట్లు భారీగా వేయించారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో […]
కేంద్ర ఎన్నికల సంఘం.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మూల స్తంభాల్లో ఒకటి. పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో నిర్ణీత కాలవ్యవధిలో చట్టసభల ఎన్నికలు నిర్వహించి.. ప్రజా ప్రభుత్వాలను కొలువు దీర్చడం ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యం. అధికారంలో ఉన్న ప్రభుత్వాల ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంతో ఎన్నికలు నిర్వహిందుకు వీలుగా రాజ్యాంగం ఈ వ్యవస్థకు సర్వాధికారాలు కట్టబెట్టింది. కానీ కమిషన్ పై కేంద్రం పెత్తనం గతంలో కొన్ని సందర్భాల్లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తగ్గినా.. గత రెండేళ్లుగా.. మరీ […]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు.. ప్రతి ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన గాజు గ్లాస్ గుర్తు.. ఈ సారి నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కు దక్కడం తో.. జనసేన, బిజెపి నేతలు.. అధికార పార్టీ వైసీపీ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. గుర్తుల కేటాయింపు లో వైసీపీ కుట్ర, వ్యూహం ఉందని, కేంద్ర ఎన్నికల […]
నోటా ఇప్పుడు అందరి నోట ఇదే పేరు వినిపిస్తోంది. వరుసగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది అందులోనూ ఏకగ్రీవాలు జరగడంతో నోటాకు ఓటు వేసే పలువురు తమ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు నోటా అంటే ఏంటి ..? ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ […]
జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. నాటి నుంచీ పలు రాష్టా్ట్రలలో ఈ ప్రస్తావన జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా పలు పార్టీల నేతలు జమిలి ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలని పలు సందర్భాల్లో సూచిస్తున్నారు. ఈ ప్రచారక్రమంలో సీఈసీ ప్రకటన సంచలనంగా మారింది. దేశమంతటా లోక్సభ, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఓ […]
బిహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన కోవిడ్కు ఉచిత టీకా హామీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాజకీయ పార్టీలు ఇలా హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తెలిపింది. సంక్షేమంలో భాగంగా ఇలాంటి హామీ ఇవ్వడం సరైనదేనని స్పష్టం చేసింది. బిహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా బిహారీలకు ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తామని పేర్కొంది. దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే […]