iDreamPost
android-app
ios-app

ఎన్నికల సమయంలో విగ్రహాలకు ముసుగు ఎందుకు వేస్తారు? ఇంత రీజన్ ఉందా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విగ్రహాలకు ముసుగులు ఎందుకు వేస్తారు అనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణం ఏంటంటే...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విగ్రహాలకు ముసుగులు ఎందుకు వేస్తారు అనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణం ఏంటంటే...

ఎన్నికల సమయంలో విగ్రహాలకు ముసుగు ఎందుకు వేస్తారు? ఇంత రీజన్  ఉందా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ-2024 సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే  రెండు విడుతల్లో పోలింగ్ పూర్తి కాగా.. మూడో విడత ఎన్నికలు నిర్వహేంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. మొత్తం ఏడు విడుతల్లో ఈ లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఎన్నికల వేళ అనేక  సందేహాలు కొందరిలో వ్యక్తమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి.. ఎన్నికల వేళ రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయడం. మరి.. అలా నేతల విగ్రహాలకు తొడుగు వేయడంకి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత దేశం ప్రజాస్వామ్య దేశం.ఇక్కడ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలే  ఉంటాయి.  అందుకే ఎన్నికలు అనే ఓ ప్రక్రియ ద్వారా  ప్రజలు తమ ఓటుతో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇక ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు అనేవి జరుగుతుంటాయి. అలానే స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలు కూడా జరుగుతుంటాయి. ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రానికి ఓ ఎన్నికల సంఘం ఉంటుంది. సీఈసీ చెప్పే ఆదేశాలను స్టేట్ ఈసీ అమలు చేస్తుంది.

ఇది ఇలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘంలో అనే నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని అతిక్రమించే నేతలు, అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. అలానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆ నిబంధనలను పక్క అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల జరిగే ప్రాంతం లేదా రాష్ట్రం మొత్తం రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు ధరిస్తుంటారు. అలా రాజకీయ నేతలకు వేసిన ముసుగులును ఎన్నికల కోడ్ ముగిసే వరకు తీయ్యకూడదు. అలా తీసిన వారిపై చర్యలు ఉంటాయి.  అయితే అలా నేతల విగ్రహాలకు ముసుగులు ఎందుకు వేస్తారు అనే అనుమానం  చాలా మందికి వస్తుంది. మరి..అలా ఎందుకు వేస్తారు అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు కొన్ని రీజన్లు చేప్పారు.

రాజకీయ నేతల విగ్రహాలను చూసి ఓటర్లు ప్రభావితులు అవుతారనే..వాటికి ముసుగులు ధరించినట్లు కొందరు చెబుతుంటారు. వాటి చూపిస్తూ నేతలు ఓటర్లను ఆకట్టుకుంటారు. వాస్తవానికి ఎన్నికల నియమాల్లో ఆ రూల్ ఉండటంతే నేతల విగ్రహాలకు తొడుగులు వేస్తున్నారు. అయితే 2009 ముందు లేదు.. ఆ సమయంలో ఓ విగ్రహం కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయని, అందుకే ఎన్నికల కమిషన్ కొత్త నిర్ణయం తీసుకుదని ఓ కథనం ఉంది.

అలానే మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్  టీఎన్ శేషన్ కాలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లు. ఎన్నికల కమిషనర్ పని చేసిన సమయంలో  తనదైన మార్క్ ను చూపించారు. ఎన్నికల రూల్స్ లో అనేక మార్పులు తెచ్చారు. ఆయన కాలంలోనే ఈ విగ్రహాలకు ముసుగు  వేయడం అనే నిబందన వచ్చిందని, ఆయనే ఈ రూల్  పెట్టారని నిబంధన  అని మరికొందరు చెబుతుంటారు. మొత్తంగా చూస్తే.. ప్రత్యేక కారణం అంటూ ఏమిలేకపోయినా.. నేతల ఫోటోలు చూసి.. ప్రభావితం కావడం, గొడవలు జరగడం వంటి కారణాలతోనే ఈ నిబంధన తెచ్చినట్లు అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.