Arjun Suravaram
General Election-2024: మరికొద్ది రోజుల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ గురించి ఓ కీలక అప్ డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం మన దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో అందరూ ఉత్కంఠంగా ఎదురు చూసే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అందుకే దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తుంటే.. ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులు మాత్రం ఏపీ ఎన్నికల షెడ్యూల్ పై ఎంతో ఆసక్తి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ ల పై కీలక అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం…మార్చి 13 తరువాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు. ప్రస్తుతం ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది. మార్చి 12,13 తేదీల్లో జమ్ముకశ్మీర్ లో ఎన్నిక అధికారులు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆ పర్యటన అనంతరం షెడ్యూల్ విడుదలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా 7 విడుతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.